Oppo Reno 13 5G Series : ఒప్పో రెనో 13 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 9నే భారత్‌లో లాంచ్.. ఫీచర్లు వివరాలివే!
Oppo Reno 13 5G Series : ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో హ్యాండ్‌సెట్‌లను కలిగిన లైనప్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది.

Oppo Reno 13 5G Series India Launch
Oppo Reno 13 5G Series : ఒప్పో రెనో 13 5జీ సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని, త్వరలో గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉండనుందని ధృవీకరించింది. ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో హ్యాండ్‌సెట్‌లను కలిగిన లైనప్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది.
రాబోయే భారతీయ వేరియంట్‌ల డిజైన్ అంశాలు, కలర్ ఆప్షన్లు గతంలో వెల్లడించాయి. ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో సహా ఫోన్‌ల అనేక ఫీచర్లు లాంచ్‌కు ముందే ధృవీకరించాయి. ఒప్పో రెనో 13 5జీ సిరీస్ నవంబర్ 2024లో చైనాలో ఆవిష్కరించింది.
ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఇండియా లాంచ్ తేదీ :
ఒప్పో రెనో 13 5జీ సిరీస్ భారత మార్కెట్లో జనవరి 9న సాయంత్రం 5 గంటలకు లాంచ్ అవుతుందని కంపెనీ (X) పోస్ట్‌లో పేర్కొంది. ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో కొనుగోలుకు ఫోన్‌లు అందుబాటులో ఉండవచ్చు.
ఒప్పో రెనో 13 5జీ ఇ-స్టోర్ జాబితాలో 8జీబీ ర్యామ్ అలాగే 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఆప్షన్లతో రానుందని సూచిస్తుంది. ఈ ఫోన్ భారతీయ వేరియంట్ ఐవరీ వైట్, లూమినస్ బ్లూ షేడ్స్‌లో వస్తుందని కంపెనీ గతంలో ధృవీకరించింది.
ఇంతలో, ఒప్పో రెనో 13ప్రో 5జీ 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లతో పాటు 12జీబీ ర్యామ్‌కు సపోర్టు అందిస్తుంది. గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫీచర్లు :
ఒప్పో రెనో 13 5జీ సిరీస్ భారతీయ వేరియంట్‌ల అధికారిక ల్యాండింగ్ పేజీ, ఫోన్‌లు ఒప్పో సిగ్నల్‌బూస్ట్ X1 చిప్‌లతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎస్ఓసీల ద్వారా పవర్ పొందుతాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఏఐ-బ్యాక్డ్ ఇమేజింగ్ ఫీచర్‌లతో అమర్చి ఉంటాయి. దుమ్మ, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంటాయి.
ఒప్పో రెనో 13ప్రో 5జీ 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్‌తో 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంటుంది. 80డబ్ల్యూ వైర్డు సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరోవైపు, వనిల్లా ఒప్పో రెనో 13 5జీ, ఇదే విధమైన ఛార్జింగ్ సామర్థ్యంతో కొంచెం చిన్న 5,600mAh బ్యాటరీని పొందుతుంది.