ఉద్యోగులూ డోంట్ ఫియర్…EPFO ప్లాన్ సూపర్

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 07:06 AM IST
ఉద్యోగులూ డోంట్ ఫియర్…EPFO ప్లాన్ సూపర్

ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తాజాగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఇకపై జాబ్ మారిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF‌) ట్రాన్స్‌ఫర్‌ క్లెయిమ్స్‌ బదిలీ కానున్నాయి. 

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (UAN‌) ఉన్నప్పటికీ ఉద్యోగి జాబ్ మారితే EPF క్లెయిమ్స్‌ బదలాయింపునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ ఉండదు.

కార్మిక శాఖ మంత్రిత్వశాఖ అధికారి ప్రకారం, ఉద్యోగం మారిన వెంటనే EPF కూడా ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందని వెల్లడించారు. EPFO ప్రతీ సంవత్సరం 8 లక్షల EPF ట్రాన్స్‌ఫర్‌ క్లెయిమ్స్‌ పొందుతుంది. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు మారిన వెంటనే ఆటోమేటిక్‌గా EPF బదిలీని EPFO చేపడుతోంది.