PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు? ఎవరు అర్హులు? లబ్ధిదారుల ఫుల్ లిస్ట్ ఇదిగో.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..!

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ రూ. 2వేలు అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

PM Kisan Samman Nidhi

PM Kisan 20th instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) యోజన భారత ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం. అర్హత కలిగిన రైతులు నేరుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని అందుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ, గృహ అవసరాలకు ఈ ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ. 6వేలు అందుతాయి.

Read Also : OPPO A5 5G Launch : కొత్త ఒప్పో A5 5G వచ్చేసిందోచ్.. భారీ బ్యాటరీ, 50MP కెమెరా హైలెట్.. ధర జస్ట్ ఎంతంటే?

ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో డబ్బు విడుదల చేస్తుంది. నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 2025లో 19వ విడత తర్వాత 20వ విడత జూన్ లేదా జూలై 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 9.8 కోట్ల మంది రైతులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందనున్నారు. అయితే, పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు పొందే రైతులు ఏయే అర్హతలు కలిగి ఉండాలి? లబ్ధిదారుల జాబితా, స్టేటస్ అనే పూర్తి వివరాలను ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరు అర్హులు? :
పౌరసత్వం : భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
భూమి యాజమాన్యం : వెరిఫైడ్ ల్యాండ్ రికార్డులతో సాగు భూమి ఉండాలి.
మినహాయింపు : ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో పనిచేస్తున్నవారు అర్హులు కాదు.
కావాల్సిన డాక్యుమెంట్లు : ఆధార్ నంబర్‌ను బ్యాంకు అకౌంట్ లింక్ చేయాలి.
పీఎం కిసాన్ లబ్ధిదారులకు e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) వెరిఫికేషన్ తప్పనిసరి.

లబ్ధిదారుల జాబితా చెక్ చేయాలంటే? :
రైతులు అధికారిక PM-KISAN పోర్టల్ ద్వారా తాము లబ్ధిదారులా కాదా అని సులభంగా ధృవీకరించుకోవచ్చు మరియు వారి వాయిదా స్థితిని తనిఖీ చేయవచ్చు. ఇక్కడ దశల వారీ మార్గదర్శిని ఉంది:

1. అధికారిక వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)కి వెళ్లండి.
2. హోం పేజీలో, ‘Farmers Corner’ సెక్షన్ ఎంచుకోండి.
3. ‘Beneficiary List’ లేదా ‘Beneficiary Status’ని ఎంచుకోండి:
‘Beneficiary List’పై క్లిక్ చేయండి.
స్టేటస్ కోసం, ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
4. అవసరమైన వివరాలు : రాష్ట్రం, జిల్లా, సబ్-జిల్లా, బ్లాక్ నెం, గ్రామాన్ని ఎంచుకోండి. స్టేటస్ కోసం ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయొచ్చు.
5. సబ్మిట్ : వివరాలను ఎంటర్ చేశాక లబ్ధిదారుల జాబితా స్టేటస్ కోసం ‘Submit’ లేదా ‘Get Data’పై క్లిక్ చేయండి.

ఈ జాబితాలో లబ్ధిదారుడి పేరు, తండ్రి, భర్త పేరు, లింగం, గ్రామం, పేమెంట్ స్టేటస్ పొదవచ్చు. రూ. 2వేలు పడ్డాయో లేదో వెరిఫై చేయడం లేదా ముందుగానే పేమెంట్‌కు సంబంధించి అర్హతను చెక్ చేయొచ్చు.

Read Also : Fingerprint 5G Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? టాప్ 7 ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే :

  • e-KYC తప్పనిసరి: e-KYC లేకుండా 20వ విడత రూ. 2వేలు పొందలేరు.
  • ఆధార్-బ్యాంక్ లింకింగ్ : మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి.
  • హెల్ప్‌లైన్ : పీఎం కిసాన్‌కు సంబంధించి హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి.
  • పీఎం కిసాన్ లబ్ధిదారుడి స్టేటస్‌కు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)ను విజిట్ చేయండి.