PM Kisan 21st Installment : రైతులకు పండగే.. ఈ తేదీనే పీఎం కిసాన్ 21వ విడత.. ఇలా చేస్తేనే రూ. 2వేలు పడతాయట.. చెక్ చేసుకోండి!
PM Kisan 21st Installment : పీఎం కిసాన్ 21వ విడత వచ్చేస్తోంది. రైతులంతా ఎదురుచూస్తున్నారు. వచ్చే నవంబర్‌లో రూ. 2వేలు పడే అవకాశం కనిపిస్తోంది.
PM Kisan 21st Installment 2025 Date
PM Kisan 21st Installment 2025 Date : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు విడుదల అవుతుందో తెలిసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానుంది.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు (PM Kisan 21st Installment) వ్యవసాయం, రోజువారీ అవసరాలకు ప్రతి ఏడాదిలో రూ.6వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పటివరకు 20 వాయిదాలు విడుదల అయ్యాయి. లక్షలాది మంది రైతులు 2025 నవంబర్ ప్రారంభంలో 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ మీరు పీఎం కిసాన్ పథకానికి అర్హులేనా? మీ పేరు జాబితాలో ఉందో లేదా అనే పూర్తి వివరాలను చెక్ చేసుకోండి.
పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుందంటే? :
నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ యోజన 21వ విడత 2025 నవంబర్ మొదటి వారంలో విడుదల కావచ్చు. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. పీఎం కిసాన్ 20వ విడతను పీఎం నరేంద్ర మోదీ ఆగస్టు 2025లో విడుదల చేశారు.
24 మిలియన్ల మంది మహిళా రైతులు సహా 98 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. సాధారణంగా, ఈ పథకం ప్రతి 4 నెలలకు ఒక విడత ఫిబ్రవరి, జూన్, అక్టోబర్-నవంబర్‌లలో విడుదల అవుతుంది. అందువల్ల, నవంబర్ ప్రారంభంలో రైతులు 21వ విడతను పొందే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ సమయంలో వాయిదా జారీ చేయవచ్చా? :
బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను విడుదల చేస్తుందా? లేదా అని రైతులు ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించలేదు. కానీ, గతంలో ఆమోదించిన పథకాల కింద పేమెంట్లను కొనసాగించవచ్చని అంటున్నారు. పీఎం కిసాన్ వంటి ప్రస్తుత పథకాల నుంచి ఫండ్స్ రైతుల ఖాతాల్లోకి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
కేవైసీ, అర్హతలను ఇలా చెక్ చేయండి :
- రైతులు రూ. 2వేలు పొందాలంటే ముందుగా e-KYC పూర్తి చేయాలి.
- OTP లేదా బయోమెట్రిక్ కేవైసీతో పీఎం కిసాన్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
పీఎం కిసాన్ బెనిఫిట్స్ ఎలా చెక్ చేయాలి? :
- పీఎం కిసాన్ (https://pmkisan.gov.in/)ని విజిట్ చేయండి.
- రైట్ సైడ్ ‘నో యువర్ స్టేటస్’పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- Get Data ఆప్షన్ ఎంచుకోండి.
ఇప్పుడు మీ వాయిదా స్టేటస్ స్ర్కీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- మీరు మీ పేరును చెక్ చేయాలి.
- వెబ్‌సైట్‌లోని లబ్ధిదారుల లిస్టు ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
- ‘Get Report’పై క్లిక్ చేయండి.
- మీ గ్రామంలోని అన్ని లబ్ధిదారుల జాబితాను తెలుసుకోవచ్చు.
- అవసరమైతే, రైతులు హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 011-24300606 ద్వారా సంప్రదించవచ్చు.
