iQOO Neo 11 : కొత్త ఐక్యూ ఫోన్ గురూ.. ఈ నెల 30నే లాంచ్.. 8K కూలింగ్ సిస్టమ్ స్పెషల్ అట్రాక్షన్.. ధర ఎంత ఉండొచ్చంటే?
iQOO Neo 11 : ఐక్యూ నియో 11 మోడల్ అక్టోబర్ 30న చైనాలో లాంచ్ కానుంది. ఇందులో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, BOE 2K అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి.

iQOO Neo 11 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గేమింగ్ ఫోన్లలో ఐక్యూ బ్రాండ్ నుంచి హై-ఎండ్ ఫోన్ అక్టోబర్ 30న చైనా మార్కెట్లో లాంచ్ అవుతుందని అధికారికంగా ధృవీకరించింది. ఐక్యూ నియో 11 పేరుతో రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్పీడ్ ప్రాసెసర్‌లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8K స్టీమ్ చాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. సుదీర్ఘ గేమింగ్ సెషన్‌లలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

హై-స్పీడ్ స్టోరేజ్, రికార్డ్-బ్రేకింగ్ బెంచ్‌మార్క్ : ఐక్యూ నియో 11 ఫోన్ LPDDR5x అల్ట్రా ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ రేట్లను అందిస్తుంది. అధికారిక టీజర్ల ప్రకారం.. ఫోన్ రికార్డు స్థాయిలో 3.54 మిలియన్ల AnTuTu స్కోరుతో బ్రేక్ చేసింది.

పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ : గీక్‌బెంచ్‌లో వివరాల ప్రకారం.. ఐక్యూ నియో 11 ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 16GB ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ సెటప్‌కు సపోర్టు ఇస్తుంది. 4.32GHz వద్ద హై-పర్ఫార్మెన్స్ కోర్లతో పాటు 3.53GHz వద్ద రన్ అయ్యే 6 ఎఫిషియెన్సీ కోర్లతో పాటు వస్తుంది.

డిస్‌ప్లే, కూలింగ్ : ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 2K రిజల్యూషన్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2,592Hz PWM డిమ్మింగ్, బీఓఈ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. సిల్కీ-స్మూత్ విజువల్స్, రెస్పాన్సివ్ టచ్ కంట్రోల్స్ కోసం 3,200Hz టచ్ శాంప్లింగ్, 25.4ms రెస్పాన్స్ టైమ్‌తో సపోర్టు ఇస్తుంది.

బ్యాటరీ, డిజైన్, కెమెరా : ఐక్యూ నియో 11 ఫోన్ 7,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 100W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐక్యూ ఫోన్ OIS, అల్ట్రావైడ్, డెప్త్ సెన్సార్లతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్‌తో రావచ్చు. భారత మార్కెట్లో ఐక్యూ నియో 11 ఫోన్ ప్రారంభ ధర రూ.34,990 నుంచి ఉండవచ్చు.
