PM Kisan 21st Installment : రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీనే పీఎం కిసాన్ 21వ విడత.. ఈ రైతులకు రూ.2వేలు రానట్టే.. చెక్ చేసుకోండి!

PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులు 21వ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది రైతులకు మాత్రం 21వ విడత రూ. 2వేలు విడుదల కావు.

PM Kisan 21st Installment : రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీనే పీఎం కిసాన్ 21వ విడత.. ఈ రైతులకు రూ.2వేలు రానట్టే.. చెక్ చేసుకోండి!

PM Kisan 21st Installment

Updated On : November 2, 2025 / 7:03 PM IST

PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత అతి త్వరలో విడుదల కానుంది. నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో 21వ విడత డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. నవంబర్ 5న రైతుల (PM Kisan 21st Installment) ఖాతాల్లో రూ. 2వేలు జమ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలంగా 21వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుందంటే? :
కేంద్ర ప్రభుత్వం 21వ వాయిదా విడుదల లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ, నివేదికల ప్రకారం.. నవంబర్ 5 నాటికి రూ. 2వేలు విడుదల చేసే అవకాశం ఉంది. ఛట్ పండుగ తర్వాత వెంటనే పీఎం కిసాన్ విడత డబ్బులు విడుదల చేస్తారని భావించగా అది జరగలేదు.

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సుమారు 2.7 మిలియన్ల మంది రైతులు ఇప్పటికే రూ. 2వేలు ముందస్తుగా అందుకున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన తీవ్ర నష్టం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతులకు ముందుగా పీఎం కిసాన్ విడతను విడుదల చేసింది. ఇప్పుడు, ఇతర రాష్ట్రాల రైతులు కూడా త్వరలో రూ. 2వేలు తమ అకౌంట్లలో పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also : OnePlus 15R Price : కొత్త వన్‌ప్లస్ 15 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 13నే గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు మాత్రం అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఏ రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు రావంటే? :
e-KYC పూర్తి చేయకపోతే రూ. 2వేలు పొందలేరు.
బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోవడం.
రాంగ్ IFSC కోడ్, క్లోజ్ బ్యాంక్ అకౌంట్ లేదా దరఖాస్తు సమయంలో తప్పుగా డేటా ఇవ్వడం
వాయిదా పొందడానికి మీరు వెంటనే ఈ పని చేయాలి.
మీ 21వ విడత కోసం ఈరోజే ఈ పనులను పూర్తి చేయండి.
పీఎం కిసాన్ పోర్టల్ లేదా CSC కేంద్రాన్ని విజిట్ చేసి వెంటనే e-KYCని పూర్తి చేయండి.
మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

లబ్ధిదారుల జాబితాలో పేరును చెక్ చేయండి :
pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
‘Farmer Corner’ సెక్షన్‌లో ‘Beneficiary List’పై క్లిక్ చేయండి.
మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
మీ జాబితాలో పేరును చూసేందుకు ‘Get Report’పై క్లిక్ చేయండి.

పీఎం కిసాన్ యోజన 21వ విడత అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాకు సకాలంలో అందుతుంది. వీలైనంత త్వరగా అవసరమైన అన్ని పనులను పూర్తి చేయండి. అప్పుడే ఎలాంటి ఆటంకం లేకుండా రూ. 2వేలు బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి.