OnePlus 15R Price : కొత్త వన్‌ప్లస్ 15 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 13నే గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు మాత్రం అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

OnePlus 15R Price : వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 15 సిరీస్ లాంచ్ కాబోతుంది. భారత మార్కెట్లో అతి త్వరలో రిలీజ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ధర ఎంత ఉంటుందంటే?

OnePlus 15R Price : కొత్త వన్‌ప్లస్ 15 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 13నే గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు మాత్రం అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

OnePlus 15R Price

Updated On : November 2, 2025 / 6:29 PM IST

OnePlus 15R Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ అభిమానుల కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. వన్‌ప్లస్ 15R అధికారికంగా నవంబర్ 13న లాంచ్ అవుతోంది. ఇందులో వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R ఉన్నాయి. వన్‌ప్లస్ ఏస్ 6 రీబ్రాండెడ్ వెర్షన్‌గా భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15 సిరీస్‌గా లాంచ్ కానుందని భావిస్తున్నారు.

చైనీస్ టెక్ దిగ్గజం ఇప్పటికే రాబోయే మోడల్ వన్‌ప్లస్ 15 సిరీస్ (OnePlus 15R Price) ఫీచర్లు, ధర గురించి అనేక వివరాలను రివీల్ చేసింది. ప్రీమియం డిజైన్, అత్యాధునిక స్పెషిఫికేషన్లు, గేమింగ్ సెంట్రలైజడ్ అప్‌గ్రేడ్ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. వన్‌ప్లస్ 15 సిరీస్ గురించి మరిన్ని వివరాలపై ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ 15R డిజైన్ :
వన్‌ప్లస్ 15R కంపెనీ సిగ్నేచర్ డిజైన్‌ కనిపిస్తోంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ కలిగి ఉంది. బరువు దాదాపు 213 గ్రాములు ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ IP66, IP68, IP69, IP69K వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. కెమెరా మాడ్యూల్ డిజైన్ ఫ్లాగ్‌షిప్‌తో వస్తుంది. చదరపు ఆకారపు బ్యాక్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిల్వర్, వైట్, డార్క్ బ్లూ, బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Price : ఆఫర్ అదిరింది బ్రో.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

వన్‌ప్లస్ 15R స్పెసిఫికేషన్లు :
నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ 15R ఫోన్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 60Hz, 90Hz, 120Hz, 144Hz, 165Hz మధ్య మారవచ్చు. ఈ వన్‌ప్లస్ 15ఆర్ పవర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కావచ్చు. 16GB వరకు LPDDR5X ర్యామ్ ఉంటుంది. వన్‌ప్లస్ కొత్త విండ్ చిప్ గేమింగ్ కోర్‌ కూడా కలిగి ఉంటుందని అంచనా.

స్టేబుల్ 165Hz గేమ్‌ప్లే, సిగ్నల్, టచ్, డిస్‌ప్లే సింక్, గైరోస్కోప్ సెన్సిటివ్ ట్రాకింగ్ ద్వారా టచ్ కంట్రోల్ అందిస్తుంది. బ్యాటరీ ఫ్రంట్ సైడ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 7800mAh యూనిట్ కలిగి ఉంది. వన్‌ప్లస్ 15Rలో సోనీ 50MP ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ వైబ్రేషన్ మోటార్, రెయిన్ టచ్ సపోర్ట్, NFC, IR బ్లాస్టర్ కూడా ఉండే అవకాశం ఉంది.

భారత్‌లో వన్‌ప్లస్ 15R ధర (అంచనా) :
వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా భారతీయ ధరను రివీల్ చేయలేదు. ప్రారంభ నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ 15R ఫోన్ 12GB + 256GB వేరియంట్‌కు దాదాపు రూ.44,999 నుంచి ఉంటుందని అంచనా.