PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలి? ఎలా అప్లయ్ చేయాలి? ఫుల్ డిటెయిల్స్

PM Kisan Scheme : పీఎం కిసాన్ 20వ విడత పడేది ఎప్పుడు? రైతులు ఎలా అప్లయ్ చేసుకోవాలి? అర్హతలేంటి? రూ.2వేలు పడాలంటే రైతులు ఏయే పనులు పూర్తి చేయాలి?

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది? రూ. 2వేలు పడాలంటే రైతులు ఏం చేయాలి? ఎలా అప్లయ్ చేయాలి? ఫుల్ డిటెయిల్స్

PM Kisan Scheme

Updated On : April 25, 2025 / 6:35 PM IST

PM Kisan Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద పేద రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది.

ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల కానుంది? దీని కోసం రైతులు ఎలా అప్లయ్ చేసుకోవాలి? అర్హతలేంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్ యోజన ఏంటి? :
రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి కిసాన్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు 4 నెలలకు రూ. 2వేలు పంపిణీ అవుతుంది. నేరుగా రైతుల ఖాతాల్లో పడతాయి. ప్రతి సంవత్సరం రూ. 6వేలు పీఎం కిసాన్ లబ్ధిదారులకు 3 విడతలుగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో క్రెడిట్ అవుతుంది.

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది? :
దేశవ్యాప్తంగా కోట్లాది మంది లబ్ధిదారుల రైతులు పీఎం కిసాన్ 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాకు పంపిణీ చేస్తారు. 18వ విడత 5 అక్టోబర్ 2024న విడుదలైంది.

19వ విడత 24 ఫిబ్రవరి 2025న హోలీకి ముందు విడుదలైంది. పీఎం కిసాన్ 20వ విడత కూడా వచ్చే జూన్‌లో వచ్చే విడుదల అయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.

రైతులు పీఎం కిసాన్ బెనిఫిట్స్ ఎలా పొందాలి? :
ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి రూ. 6వేలు అందుకుంటారు. ప్రతి నాలుగు నెలలకు రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో పంపిణీ అవుతుంది. ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుంది.

పీఎం కిసాన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? :
పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సంబంధిత రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని విజిట్ చేయడం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తు చేసేందుకు ఈ మూడు డాక్యుమెంట్లు అవసరం.

  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు
  • భూమి రికార్డులు

పీఎం కిసాన్ కోసం e-KYC ఎలా చేయాలి? :

  • ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఆ తర్వాత ‘Farmers Corner’ ఎంచుకోండి
  • e-KYC ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసి Get OTP ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి Submit చేయండి.