PNB Housing Finance : హైదరాబాద్‌లో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త ప్రైమ్ బ్రాంచ్‌ ఓపెనింగ్..!

PNB Housing Finance : పీఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. నగరంలోని వినియోగదారులకు అవసరాలకు తగినట్టుగా తమ ఫైనాన్స్‌కు సంబంధించి కార్యకలాపాలను కంపెనీ విస్తరించింది.

PNB Housing Finance : హైదరాబాద్‌లో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త ప్రైమ్ బ్రాంచ్‌ ఓపెనింగ్..!

PNB Housing Finance Expands its Footprint in Hyderabad with the Inauguration of a New Branch

PNB Housing Finance : భారత్‌లోని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి. దేశవ్యాప్తంగా తమ సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈరోజు (డిసెంబర్ 2)న కొత్త ప్రైమ్ బ్రాంచ్‌ను పీఎన్‌బీ ప్రారంభించింది. ఈ విస్తరణతో వినియోగదారులకు మరిన్ని సర్వీసులను అందించనుంది. హౌసింగ్ ఫైనాన్స్ సొల్యూషన్‌లకు తగిన అవకాశాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. పీఎన్‌బీకి చెందిన ఇతర సీనియర్ అధికారులతో కలిసి రిటైల్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ దిలీప్ వైతీశ్వరన్ ఈ కొత్త శాఖను ప్రారంభించారు.

Read Also : Credit Card Payments : పేటీఎంలో యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

రియల్ ఎస్టేట్ పరిశ్రమలో గృహ కొనుగోలుదారుల నిర్ణయాత్మక విధానాలలో అనేక మార్పులను తీసుకొచ్చింది. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లకు అవసరాలకు తగినట్టుగా అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలకు ఒక వ్యూహాత్మక విధానాన్ని అందిస్తోంది. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ రెండు కీలక విభాగాలలో ప్రైమ్ హౌసింగ్‌పై దృష్టి సారించింది. గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా వినూత్నమైన ఆర్థిక పరిష్కారాలను అందిస్తుంది. వినియోగదారుల వేతనం, స్వయం ఉపాధిపై రెండింటి అవసరాలను తీరుస్తుంది.

అందుకే హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ ఏర్పాటు :
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ గిరీష్ కౌస్గి మాట్లాడుతూ.. ‘మా కస్టమర్ల అవసరాలను తీర్చడానికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా యూజర్లకు సేవలు, డిజిటల్ సామర్థ్యాల మద్దతుతో వినూత్న గృహ రుణ పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాం. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. నగరంలోని మౌలిక సదుపాయాలకు సరిపోయేలా గృహ సౌకర్యాల అవసరం పెరుగుతోంది. అందుకే నగరంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం.

PNB Housing Finance Expands its Footprint in Hyderabad with the Inauguration of a New Branch

PNB Housing Finance Branch

విస్తృత నెట్‌వర్క్ బ్రాంచ్‌లు & ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలలో సాంకేతిక సామర్థ్యాలను అందించడం ద్వారా ఇంటి యాజమాన్యం కలలను సాధించుకోవచ్చు’ అని ఆయన అన్నారు. డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫారమ్ ఏసీఈ ద్వారా కస్టమర్-సెంట్రిక్ ప్రయోజనాలు, టెక్ సొల్యూషన్స్, సౌకర్యవంతమైన అప్లికేషన్ ప్రాసెస్ వంటి సర్వీసులను అందిస్తుంది.

లోన్ పేమెంట్ కాల పరిమితి, హై లోన్-టు-వాల్యూ రేషియో, సరసమైన వడ్డీ రేట్లు, సులభమైన ఫైనాన్సింగ్ అవకాశాలు ఇందులో ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఈ బ్రాండ్, ప్రైమ్ సెగ్మెంట్‌ అవసరాలను తీర్చటానికి దాదాపు 110 శాఖల బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సరసమైన గృహాల విభాగానికి అంకితమైన 100 శాఖలను కలిగి ఉంది.

138 ప్రైమ్ బ్రాంచుల ఏర్పాటు దిశగా :
‘అందరికీ హౌసింగ్’ అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రిటైల్ విభాగంలో నైపుణ్యంతో వృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఉంది. సెప్టెంబర్ 30, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రిటైల్ పంపిణీ రూ. 7,832 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం ప్రైమ్ బ్రాంచ్‌ల సంఖ్యను 138కి చేర్చాలని భావిస్తోంది. అంతేకాకుండా ‘ప్రైమ్’ రిటైల్ లోన్‌ ఆఫర్ కింద అదనపు బ్రాంచ్‌లను కూడా ఓపెన్ చేయాలని భావిస్తోంది.

Read Also : Redmi K70 Series Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50ఎంపీ కెమెరాతో రెడ్‌మి కె70 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?