రేణిగుంట-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

  • Published By: chvmurthy ,Published On : January 1, 2020 / 05:04 AM IST
రేణిగుంట-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

Updated On : January 1, 2020 / 5:04 AM IST

సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జైపూర్‌- రేణిగుంట మధ్య దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఈ ప్రత్యేక రైళ్లు జైపూర్‌లో (09715) 2020, జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి దుర్గాపూర్‌, సావిమాధోపూర్‌, కోట జంక్షన్‌, ఉజ్జయిని, భోపాల్‌, న్యూ అమరావతి, వార్దా జంక్షన్‌, వరంగల్‌, విజయవాడ, తెనాలి, గూడూరు మీదుగా రెండో రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. 

రేణిగుంటలో (09716) 2020, జనవరి నెల 6, 13, 20, 27, వచ్చే నెల 3న రాత్రి 8.30 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలోనే రెండో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు జైపూర్‌కు చేరుతుంది.