Post Office Scheme : పోస్టాఫీసులో అదిరే స్కీమ్.. సీనియర్ సిటిజన్లు ఇలా పెట్టుబడి పెడితే.. ప్రతినెలా రూ. 20,500 పెన్షన్ పొందొచ్చు!

Post Office Scheme : రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని అందించే అద్భుతమైన పథకం కోసం చూస్తున్నారా?

Post Office Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. పోస్టాఫీస్ (Post Office Scheme) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా రూ. 20,500 సంపాదించవచ్చు.

Read Also :  Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ఈ పథకం కింద సీనియర్ సిటిజన్ల పెన్షన్ పొందవచ్చు. పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థికంగా లోటు లేకుండా ఉండవచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో పెట్టుబడి పెట్టే ముందు పథకం నిబంధనలు, షరతులు, కలిగే ప్రయోజనాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

నెలకు రూ. 20,500 వరకు పెన్షన్ :
సీనియర్ సిటిజన్లు SCSS పథకం (Post Office Scheme) కింద గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. సంవత్సరానికి దాదాపు రూ. 2 లక్షల 46 వేల వడ్డీ లభిస్తుంది. ప్రతి నెలా దాదాపు రూ. 20,500 ఆదాయం మీ బ్యాంకు అకౌంటులో జమ అవుతుంది. ఈ పథకం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంటుంది.

ఎంత పెట్టుబడి పెట్టాలి? :
గతంలో SCSSలో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉండేది. కానీ, ఇప్పుడు రూ. 30 లక్షలకు పెంచారు. ఈ పథకంలో పెట్టుబడిని ఒకేసారి పెట్టాలి. వడ్డీ ప్రతి త్రైమాసికంలో మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? :
60 ఏళ్లు లేదా అంతకంటే (Post Office Scheme) ఎక్కువ వయస్సు గల వారు పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్మెంట్ (VRS) తీసుకున్న 55 ఏళ్ల వయస్సు నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు పెట్టవచ్చు. ఈ స్కీమ్ అకౌంట్ పోస్టాఫీసులో లేదా ఏదైనా బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు.

పన్ను ఉంటుందా? :
SCSS పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుంది. అయితే, పెట్టుబడి మొత్తం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

Read Also : Apple Days Sale 2025 : ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్లు, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్‌లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఈ బిగ్ డీల్స్ పొందాలంటే?

పథకం వ్యవధి ఎంత? :
ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత మరో 3 ఏళ్లు పథకాన్ని పొడిగించవచ్చు. ముందస్తుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, పెనాల్టీ పడుతుందని గమనించాలి.