హైదరాబాద్‌లో లోన్ మోసం: నమ్మారో బ్యాంకులో మొత్తం నొక్కేస్తారు

ప్రీ అప్రూవల్ లోన్ మీకు అప్రూవ్ అయ్యింది అంటూ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. వారి మాయలో పడిపోతే మీ ఖాతాలో ఉన్న డబ్బు పోయే అవకాశం ఉంది.

  • Published By: vamsi ,Published On : April 16, 2019 / 03:25 AM IST
హైదరాబాద్‌లో లోన్ మోసం: నమ్మారో బ్యాంకులో మొత్తం నొక్కేస్తారు

Updated On : April 16, 2019 / 3:25 AM IST

ప్రీ అప్రూవల్ లోన్ మీకు అప్రూవ్ అయ్యింది అంటూ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. వారి మాయలో పడిపోతే మీ ఖాతాలో ఉన్న డబ్బు పోయే అవకాశం ఉంది.

ప్రీ అప్రూవల్ లోన్ మీకు అప్రూవ్ అయ్యింది అంటూ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. వారి మాయలో పడిపోతే మీ ఖాతాలో ఉన్న డబ్బు పోయే అవకాశం ఉంది. అవును ఇది నిజమే.. మీకు రూ.5లక్షల లోన్ అప్రూవ్ అయ్యింది అంటూ కాల్ చేస్తారు. మీరు ఆన్‌లైన్‌లోనే డబ్బు తీసుకోవచ్చు అంటారు నమ్మి వారికి డీటెయిల్స్ చెప్పారో బుక్కైపోతారు. హైదరాబాద్‌ నగరంలో ఈమేరకు నేరాలు పెరిగిపోయాయి. 
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్

నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటువంటి కేసులు గత నెలరోజుల్లో దాదాపు 10 వరకు నమోదయ్యాయి. ఓటీపీ చెప్పమనగానే చెప్పారంటే అకౌంట్‌లో డబ్బు మొత్తం నొక్కేస్తున్నారు. సైబర్ నేరస్తులు రూ.5లక్షలు, అంతకంటే ఎక్కువ చెప్పడంతో కష్టమర్లు ఆశపడుతున్నారని అయితే చివరకు మాత్రం ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఖాతాలో మినిమమ్ బ్యాలన్స్ మెయింటెన్ చేయాలని కూడా వారే సూచించడం జరుగుతుంది.

లోన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ డబ్బును మీ పేరు మీద సైబర్ నేరగాళ్లు తీసుకోవడం కూడా జరుగుతుంది. గత రెండు నెలల్లో నమోదైన ఇటువంటి కేసుల్లో రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు తమ డబ్బును కోల్పోయినట్లు బాధితులు చెబుతున్నారు. 
Read Also : ఒక్క మ్యాచ్ ఓడితే దారి మూసుకుపోయినట్లు కాదు: చాహల్