Pure EV: ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్ ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ డెలివరీలు ప్రారంభం
ఎకోడ్రిఫ్ట్ మోటర్‌సైకిల్‌ను 99,999 రూపాయలలో ప్రారంభోత్సవ ధరగా (ఢిల్లీ ఎక్స్ షోరూం) గత నెల ప్యూర్ విడుదల చేసింది. ప్యూర్ వెల్లడించే దాని ప్రకారం, గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే మూడు డ్రైవింగ్ మోడ్స్‌లో 130 కిలోమీటర్లు గరిష్టంగా ప్రయాణిస్తుంది.

Pure EV eco Dryft Electric Motorcycle stars deliveries in India
Pure EV: ప్యూర్ ఈవీ తమ తాజా కమ్యూట్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్, ఎకో డ్రిఫ్ట్ డెలివరీలను ప్రకటించిన టైం కంటే ముందుగానే ప్రారంభించింది. తొలి విడత డెలివరీలను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తమ డీలర్‌షిప్ ఔట్‌లెట్ల వద్ద విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా తమ ఔట్‌లెట్ల వద్ద స్టాక్స్‌ను కంపెనీ అందుబాటులో పెట్టింది. అయితే ఈ డెలివరీలను ఉగాది రోజున (22 మార్చి 2023) ప్రారంభించనుంది.
ఈ విషయమై సంస్థ యజమాని నాగేంద్ర రావు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పెట్రోల్ మోటర్‌సైకిల్ వాహన యజమానిగా, నా బడ్జెట్‌కు సరిపోతూనే 100 కిలోమీటర్ల దూరం ఒక్క చార్జింగ్‌తో ప్రయాణించగల మోటర్‌సైకిల్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఎకోడ్రిఫ్ట్ విడుదల గురించి నేను ఫిబ్రవరిలో విన్న వెంటనే, దగ్గరలోని డీలర్‌షిప్ (ఈ డ్రైవ్ మోటర్స్, హైదరాబాద్)కు వెళ్లి, టెస్ట్ డ్రైవ్ చేశాను. వెంటనే ఫిబ్రవరిలోనే ఈ వాహనాన్ని బుక్ చేసుకుని, మార్చిలో వాహనాన్ని వెంట తీసుకుని వెళ్తున్నాను’’ అని అన్నారు.