Coin Vending Machine: కాయిన్లకు ప్రత్యేకంగా ఏటీఎం.. నోట్లే కాదు, ఇక నాణేలు కూడా ఎనీ టైం తీసుకోవచ్చు

ఆర్‌బీఐ తీసుకువస్తున్న ఈ నూతన కార్యక్రమాన్ని తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ఈ క్యూసీవీఎంలను (క్యూఆర్‌ కోడ్‌బేస్డ్‌ కాయిన్‌ వెండింగ్‌ మెషిన్‌) 12 నగరాల్లోని 19 చోట్ల ఏర్పాటు చేస్తారు

Coin Vending Machine: కాయిన్లకు ప్రత్యేకంగా ఏటీఎం.. నోట్లే కాదు, ఇక నాణేలు కూడా ఎనీ టైం తీసుకోవచ్చు

QR Code-based Coin Vending Machine pilot on cards

Updated On : February 8, 2023 / 7:14 PM IST

Coin Vending Machine: ఏటీఎం నుంచి నోట్లు తీసుకోవడానికి ఎలాంటి వెసులుబాటు ఉందో, అలాంటి వెసులుబాటే నాణేలు తీసుకోవడానికి కూడా అందుబాటులోకి రానుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాయిన్‌ వెండింగ్‌ మెషిన్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ నాణేలు ఏటీఎం రూపంలో అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు చేయవలసిందేంటంటే.. క్యూఆర్‌ కోడ్‌ను (QR code) స్కాన్‌ చేయడం ద్వారా మెషిన్ల నుంచి నాణేలను పొందొచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు.

PM Modi: అదానీని వదలని అపోజిషన్.. యూపీఏ స్కాంలను ఎకరువు పెట్టిన పీఎం మోదీ

ఆర్‌బీఐ తీసుకువస్తున్న ఈ నూతన కార్యక్రమాన్ని తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ఈ క్యూసీవీఎంలను (క్యూఆర్‌ కోడ్‌బేస్డ్‌ కాయిన్‌ వెండింగ్‌ మెషిన్‌) 12 నగరాల్లోని 19 చోట్ల ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ముఖ్యమైన కూడళ్లలో అందుబాటులో ఉంచుతారు. ఫలితాల ఆధారంగా క్యూసీవీఎంల ద్వారా నాణేలను అందుబాటులో ఉంచేలా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

Mahua Moitra: పార్లమెంటులో బీజేపీ నేతపై అభ్యంతరకర పదం.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనంటున్న మహువా