Mahua Moitra: పార్లమెంటులో బీజేపీ నేతపై అభ్యంతరకర పదం.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనంటున్న మహువా

మంగళవారం సమావేశాల సందర్భంగా మహువా మోయిత్రా మాట్లాడారు. ఆమె ప్రసంగంలో బీజేపీ నేతలు పలుమార్లు అడ్డుపడ్డారు. నినాదాలు చేస్తూ, అభ్యంతరం చెబుతూ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ భర్తృహరికి మహువా పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్రసంగం అనంతరం కూడా బీజేపీ నేతల నుంచి పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి

Mahua Moitra: పార్లమెంటులో బీజేపీ నేతపై అభ్యంతరకర పదం.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనంటున్న మహువా

Mahua Moitra refuses to apologise for her remark

Mahua Moitra: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‭సభలో భారతీయ జనతా పార్టీ నేతను ఉద్దేశించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహువా క్షమాపణ చెప్పాంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. నెట్టింట్లో కూడా ఆమెపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ మహువా మాత్రం వెనక్కి తగ్గనని అంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఎంత మాత్రం క్షమాపణ చెప్పబోనని బుధవారం ఆమె స్పష్టం చేశారు.

Mahua Moitra: మహిళా ఎంపీ అభ్యంతకర వ్యాఖ్యలు.. పార్లమెంట్ లో వాడకూడని పదాలు ఇవే..

ఆమెపై వస్తున్న విమర్శలపై బుధవారం ఆమె స్పందిస్తూ ‘‘పార్లమెంట్ విలువలు, సంప్రదాయాల గురించి బీజేపీ లెక్చర్లు ఇస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీ నుంచి ఎన్నికైన ఆ వ్యక్తి నన్ను మధ్యలో అడ్డుకోవాలని ప్రయత్నించారు. నేను యాపిల్‭ను యాపిల్ అనే అంటాను. కానీ ఆరెంజ్ అని అనను. వాళ్లు నన్ను ప్రివిలేజెస్ కమిటీకి తీసుకెళితే, నా వైపు ఉన్న సత్యాన్ని నేను చెప్తాను’’ అని అన్నానరు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘ఒక మహిళగా అలాంటి పదాన్ని ఎలా ఉపయోగించానని బీజేపీ నేతలు ప్రశ్నించడం నాకు నవ్వొస్తుంది. సరైన బదులు ఇవ్వడానికి నేను మనిషిని కానా? వాళ్ల పితృస్వామ్యం ఇక్కడ బయటపడుతోంది’’ అని అన్నారు.

Parliament updates: మీరు రాహుల్ గాంధీని “పప్పు” చేయాలనుకున్నారు.. ఆయనే మిమ్మల్ని”పప్పు”ను చేశారు: అధీర్ రంజన్

మంగళవారం సమావేశాల సందర్భంగా మహువా మోయిత్రా మాట్లాడారు. ఆమె ప్రసంగంలో బీజేపీ నేతలు పలుమార్లు అడ్డుపడ్డారు. నినాదాలు చేస్తూ, అభ్యంతరం చెబుతూ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ భర్తృహరికి మహువా పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్రసంగం అనంతరం కూడా బీజేపీ నేతల నుంచి పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహువా పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తున్నారు. ఇంతలో బీజేపీ నేతను ఉద్దేశించి మహువా అభ్యంతరకర పదం వాడారు. ఈ పదాన్ని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ, వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.