కొత్త టైమింగ్స్ ఇవే : RTGS ఫండ్ ట్రాన్స్‌పర్ చేస్తున్నారా?
డిజిటల్ పేమెంట్స్ ప్రొత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్పులు చేస్తోంది.

డిజిటల్ పేమెంట్స్ ప్రొత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్పులు చేస్తోంది.
డిజిటల్ పేమెంట్స్ ప్రొత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్పులు చేస్తోంది. 2019 నుంచి 2021 నాటికి ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలు అధికంగా పెరిగేలా రోడ్ మ్యాప్ వేస్తోంది. ఇప్పటికే బ్యాంకింగ్ సెక్టారులో రెగ్యులేటర్ సిస్టమ్ పై ఎన్నో ప్రకటనలు జారీ చేసింది. రెండు వారాల క్రితమే NEFT ఫండ్ ట్రాన్స్ పర్ సదుపాయాన్ని 24 గంటలు చేసింది. అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉండేది. ఆర్బీఐ ప్రకటనతో NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ పర్) లావాదేవీలు డిసెంబర్ నుంచి ఎప్పుడంటే అప్పుడూ లావాదేవీలు చేసుకునేలా రౌండ్ క్లాక్ కానున్నాయి.
అలాగే RTGS (రియల్ టైం గ్రాస్ సెటిల్ మెంట్) ఫండ్ ట్రాన్స్ పర్ సంబంధించి ఆర్బీఐ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. RTGS ఫండ్ ట్రాన్స్ పర్ చేసే సమయాల్లో మార్పులు చేసింది. RTGS పేమెంట్ సిస్టమ్ సమయం ఒక గంట వెనక్కు పొడిగించింది. వచ్చే సోమవారం (ఆగస్టు 26) నుంచి ఈ కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి. సాధారణంగా RTGS సిస్టమ్ పనిచేసే సమయంలో కస్టమర్ల లావాదేవీలు జరిపేందుకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండేది.
ఇంటర్ బ్యాంక్ లావాదేవీలపై మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు సమయం ఉంది. RTGS పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ అవర్స్ పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచే కస్టమర్లు, బ్యాంకుల RTGS ఫండ్ ట్రాన్స్ పర్ చేసుకోవచ్చునని ఆర్బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2019 లో ఆర్బీఐ రెగ్యులేటర్ పేమెంట్ సిస్టమ్ టైమింగ్స్ పెంచడం ఇది రెండోసారి.
ఈ ఏడాది మే నెలలోనే RTGS టైమింగ్స్ గంటన్నర సమయానికి పొడిగించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త సమాయాలు అమల్లోకి వచ్చాయి. RTGS ద్వారా మనీ ట్రాన్స్ పర్ చేయాలంటే కనీసం రూ.2లక్షలు.. ఆపైనా పంపుకోవచ్చు. అదే.. NEFT ద్వారా అయితే మాత్రం రూ.2లక్షల లోపు ట్రాన్స్ జెక్షన్లు చేసుకోవచ్చు.