RBI Restrictions : ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ. 25వేలు మాత్రమే విత్ డ్రా చేయగలరు.. ఎప్పటినుంచంటే?

RBI Restrictions : నష్టాల్లో నడుస్తున్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇందులో డిపాజిటర్ల విత్ డ్రా వంటివి కూడా ఉన్నాయి.

RBI Restrictions : ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ. 25వేలు మాత్రమే విత్ డ్రా చేయగలరు.. ఎప్పటినుంచంటే?

RBI Restrictions

Updated On : February 25, 2025 / 12:20 PM IST

RBI Restrictions : న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది.

ఇప్పుడు ఈ బ్యాంకు కస్టమర్లు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకోవడానికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బ్యాంకులోని అకౌంట్ కలిగిన డిపాజిటర్లు ఫిబ్రవరి 27 నుంచి రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకోగలరు. ప్రతి డిపాజిటర్‌పై ఆర్బీఐ రూ. 25వేల పరిమితి విధించింది.

Read Also : PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? అసలు కారణం ఇదే.. ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే?

ఆర్‌బిఐ ఆంక్షలు ఇవే :
నష్టాల్లో నడుస్తున్న న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షల నేపథ్యంలో డిపాజిటర్లు తమ డబ్బు విత్‌డ్రా చేసుకోవడం ఇబ్బందిగా మారింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై నిషేధం ఫిబ్రవరి 13 నుంచి అమల్లోకి వచ్చింది.

రాబోయే ఆరు నెలల వరకు ఇదే ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే, ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం.. ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు ఫిబ్రవరి 27, 2025 నుంచి ఒక్కో డిపాజిటర్ నుంచి రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ విత్ డ్రా కోసం డిపాజిటర్లు బ్యాంకు శాఖతో పాటు ఏటీఎం నుంచి కూడా విత్ డ్రా చేసుకోవచ్చునని ఆర్బీఐ తెలిపింది.

ఈ సడలింపుతో మొత్తం డిపాజిటర్లలో 50 శాతం కన్నా ఎక్కువ మంది తమ మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోగలరు. మిగిలిన డిపాజిటర్లు తమ డిపాజిట్ ఖాతాల నుంచి రూ.25వేల వరకు ఉపసంహరించుకోగలరని ఆర్‌బిఐ తెలిపింది.

గతంలో, డిపాజిటర్ సేవింగ్స్ బ్యాంక్ లేదా కరెంట్ అకౌంట్ లేదా మరే ఇతర ఖాతా నుంచి ఎలాంటి మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించవద్దని ఆర్‌బిఐ బ్యాంకును ఆదేశించింది.

Read Also : iPhone 16e Price : పాకిస్తాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e ధర ఎంతో తెలుసా? మీరు వంద శాతం ఊహించలేరు.. నిజం తెలిస్తే షాక్ అవుతారు!

న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ అనేక ఆంక్షలు విధించింది. బ్యాంకు డబ్బు అప్పుగా ఇవ్వకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా, చెల్లింపులు చేయకుండా నిషేధించింది. ఆ తర్వాత ఆర్‌బిఐ బ్యాంకు బోర్డును తొలగించి బ్యాంకు కార్యకలాపాలను తన ఆధీనంలోకి తీసుకుంది.

ఆర్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధికారి శ్రీకాంత్‌ను న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ఆయన రాబోయే 12 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.