Real Estate Boom In Hyderabad : హైదరాబాద్‎లో తగ్గని రియల్ ఎస్టేట్ జోరు

Real Estate Boom In Hyderabad : గ్రేటర్‌ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకెళ్తోంది. కొవిడ్‌తో కొంతకాలం సతమతమైన నిర్మాణరంగం... కాస్త పుంజుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అందులోనూ హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ.

Real Estate Boom In Hyderabad

Real Estate Boom In Hyderabad : దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా… గ్రేటర్‌ హైదరాబాద్‌లో మాత్రం రియల్‌ ఎస్టేట్ జోరు తగ్గడంలేదు. హైదరాబాద్‌కు ఉన్న పరిస్థితులు ఇక్కడి రియాల్టీ మార్కెట్‌ను 365 రోజులు బిజీగా ఉండేలా చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో మనీ సర్క్యూలేషన్‌ లేదని వినిపించడమే కానీ… ఓ వైపు రిజిస్ట్రేషన్లు, మరోవైపు నిర్మాణ అనుమతులు ఎక్కడా తగ్గడం లేదు. దేశంలో మరే సిటీకి లేనన్ని సౌకర్యాలు హైదరాబాద్‌కు ఉండడమే రియల్ జోరుకు కారణం అంటున్నారు విశ్లేషకులు.

Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకెళ్తోంది. కొవిడ్‌తో కొంతకాలం సతమతమైన నిర్మాణరంగం… కాస్త పుంజుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అందులోనూ హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. వాతావరణపరంగాను మౌలిక సదుపాయాల కల్పనలోనూ మెరుగైన నగరం. అదే ఇప్పుడు విశ్వనగరం విస్తరణకు కారణమవుతోంది.

ఎన్నికల వేళలోనూ పెరుగుతున్న ప్రాజెక్టులు :
వివిధ కారణాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియాల్టీ రంగం డెవలప్‌మెంట్‌ తగ్గితే… హైదరాబాద్‌లో మాత్రం అందుకు భిన్నంగా నిర్మాణ రంగం జోరు కొనసాగిస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పటికీ… రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అమ్మకాలు, నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టుల పర్మిషన్లలోనూ రియల్ ఎస్టేట్ సెక్టార్ దూకుడు కొనసాగిస్తుంది.

హైదరాబాద్‌ చుట్టూ ఏ ప్రాంతం నుంచి అయినా మరో ప్రాంతానికి కనెక్టివిటి కల్పించిన ఔటర్ రింగ్ రోడ్డు ఆధారంగా అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసిపోని బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది హైదరాబాద్‌. చిన్న చిన్న అనుమతులు మినహా మిగతా అన్ని అనుమతులు HMDA, GHMC వంటి సంస్థలు ఇస్తున్నాయి.

అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు :
ఇప్పుడు అవన్నీ ఆన్‌లైన్‌లో టీఎస్‌బీపాస్‌ ద్వారా వస్తున్నాయి. గతేడాది ఇచ్చిన అనుమతులకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ ఏడాది ఇప్పటివరకు దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక ఏడాదిలో టీఎస్‌ బీపాస్‌ ద్వారా 90 వేల దరఖాస్తులు రాగా… ఈ ఏడాది జనవరి నాటికి 70 వేల దరఖాస్తులు వచ్చాయి. మరో 20వేల దరఖాస్తులు కూడా క్లియర్ అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. రాబోయే రెండు నెలలు పూర్తిగా ఎన్నికలకాలం. అయినా రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అవి ఏమాత్రం అడ్డంకిగా ఉండే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రియాల్టీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.

మెట్రో విస్తరణ, ఇండస్ట్రియల్ క్లస్టర్‌, రీజనల్‌ రింగ్‌రోడ్‌, శాటిలైట్ నిర్మాణాలు వంటి వాటిపై చర్యలను వేగవంతం చేస్తోంది. దీంతో రాబోయే కాలంలో పెట్టుబడులకు మరింత అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే వాటి విలువ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదని అంటున్నారు. పెట్టుబడులకు ఇదే మంచి సమయమని సూచిస్తున్నారు.

ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు ఉన్నా, లేకపోయినా నిర్మాణ రంగం మాత్రం జెట్‌స్పీడ్‌గా దూసుకెళ్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో రోడ్ నెట్‌వర్క్‌ అన్నిప్రాంతాలకు ఉంది. త్వరలో రెండో దశలో మెట్రో రైల్ విస్తరణ జరగనుంది. వివిధ కారణాలతో హైదరాబాద్‌ సిటీ విస్తరణతో పాటు రియల్‌ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకెళ్తుంది. హైదరాబాద్ వాతావరణం కూడా నగరంలో పెట్టుబడులకు ప్రధానం కారణం. రియాల్టీ రంగంలో ప్రభుత్వ ఆలోచనలు అమలైతే… భవిష్యత్‌లో హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని రియల్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : Demand For WorkSpace : హాట్ కేక్‎లా కమర్షియల్ స్పేస్.. గ్రేటర్‌లో కమర్షియల్‌ నిర్మాణాలకు ఫుల్‌ డిమాండ్

ట్రెండింగ్ వార్తలు