Demand For WorkSpace : హాట్ కేక్‎లా కమర్షియల్ స్పేస్.. గ్రేటర్‌లో కమర్షియల్‌ నిర్మాణాలకు ఫుల్‌ డిమాండ్

Demand For WorkSpace : ఐటీతోపాటు పలు కంపెనీలు హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉద్యోగాల కల్పన కూడా నగరంలో భారీగా పెరింది. దాంతో సిటిలో ఆఫిస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది.

Demand For WorkSpace : హాట్ కేక్‎లా కమర్షియల్ స్పేస్.. గ్రేటర్‌లో కమర్షియల్‌ నిర్మాణాలకు ఫుల్‌ డిమాండ్

Huge Demand For Hyderabad over Office Space

Demand For WorkSpace : రియాల్టీరంగంలో తనదైన ముద్ర వేస్తున్న హైదరాబాద్‌… ఆఫీస్ స్పేస్ డెవలప్‌మెంట్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. నగరం నలువైపుల వస్తున్న భవనాల్లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలు కూడా భారీగా ఉంటున్నాయి. ప్రధానంగా ఐటీ డెవలప్‌మెంట్‌ ఉన్న వెస్ట్ జోన్‌లో మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ ఆక్యూపెన్సీలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది.

విశాలమైన ఆఫీస్‌లకు మరింత డిమాండ్‌ :
మంచి వాతావరణ పరిస్థితులున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రియాలీటి రంగ వృద్ధి రోజురోజుకు పెరుగుతుంది. నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్ డిమాండ్ ఎక్కువవుతుంది. నగరంలో వెస్ట్ జోన్, ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలపాలను సిటిలో ప్రారంభిస్తున్నాయి. ఐటీతోపాటు పలు కంపెనీలు హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఉద్యోగాల కల్పన కూడా నగరంలో భారీగా పెరింది. దాంతో సిటిలో ఆఫిస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుంది.

Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!

ఆఫీస్‌ స్పేస్‌ కోసం సిటీలో పెరిగిన అద్దె :
ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌లతోపాటు గ్లోబల్ క్యాపబులీటి సెంటర్లు – సిటీలో ఆఫీస్ స్పేస్ కోసం చూస్తుండటంతో కమర్షియల్‌ స్పేస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్‌లో ఏడాది కాలంగా 88లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2022తో పోలిస్తే ఇది 32 శాతం అధికంగా ఉంది. ఇందులో ఆఫీస్ స్పేస్ ఉన్న నిర్మాణాలు ఎక్కువ ఉన్నాయి.

గతేడాది కాలంగా జరిగిన లావాదేవీల్లో లక్షకన్న ఎక్కువ చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ లీజ్‌ వ్యవహారాల్లో 50శాతం వృద్ది ఉంది. లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయల స్పెస్ 54లక్షల చదరపు అడుగుల వరకు లీజ్ అగ్రిమెంట్లు జరిగాయి. 50వేల చదరపు అడుగుల వరకు ఉన్న నిర్మాణాల్లో 14లక్షల చదరపు అడుగుల సంస్థల లీజు తీసుకున్నారు.

రెండో స్థానంలో హైదరాబాద్ నగరం :
కమర్షియల్‌ ఆఫీసుల అద్దె విలువ పెరుగుదలలో దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ నగరంలో గతంతో పోల్చితే 8 శాతం వృద్ధి నమోదైంది. చెన్నై 10 శాతం పెరుగుదలను నమోదు చేసి మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలున్నాయి.

గతేడాది జరిగిన మొత్తం లావాదేవీల్లో 31 శాతం వరకు వస్త్ర దుకాణాలు, 26 శాతం వరకు మాల్స్ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో అప్పటి వరకు రెసిడెన్షియల్ జోన్‌గా ఉన్న చోట్ల ఇప్పుడు కమర్షియల్ అనుమతులు పెరుగుతున్నాయి. ఇలా మొత్తంగా నగరంలో వర్క్ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగింది.

Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు