Realme GT 6T
Realme GT 6T : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బడ్జెట్ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల వరకు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మల్టీ టాస్కింగ్ ఫోన్ల కోసం చూస్తుంటే ఇదే సరైన ఫోన్ అని చెప్పవచ్చు. అమెజాన్ గత ఏడాది మేలో లాంచ్ అయిన అద్భుతమైన రియల్‌మి GT 6T ఫోన్ తక్కువ ధరకే అందిస్తోంది.
రియల్‌మి GT 6T ఆకర్షణీయమైన డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. గేమింగ్ వంటి ఫీచర్లకు బెస్ట్ ఆప్షన్ కూడా. అమెజాన్‌లో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ ధర కన్నా చాలా తక్కువ ధరకు పొందవచ్చు. రియల్‌మి GT 6T ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నప్పటికీ గ్లాస్ ప్యానెల్ అత్యంత ఆకర్షణగా ఉంటుంది. రియల్‌మి GT 6T ఫోన్‌పై మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం.
రియల్‌మి GT 6Tపై అదిరే డిస్కౌంట్ :
లాంచ్ సమయంలో రియల్‌మి GT 6T ఫోన్ రూ.32,999కు అందుబాటులో ఉంది. అయితే, అమెజాన్‌లో 19 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.28,998కి తగ్గుతుంది. ఈ ఆఫర్ 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్‌కు వర్తిస్తుంది.
అదనంగా, ఈ డీల్ కోసం మరిన్ని బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. మీరు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.1,500 వరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని వినియోగదారులకు రూ.5వేల కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంది.
మీరు ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌లతో దాదాపు రూ.22,498కి పొందవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.27,350 వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు.. మీ పాత ఫోన్‌పై రూ.15వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందితే.. మీరు రియల్‌మి GT 6T ఫోన్ కేవలం రూ.12,350కి పొందవచ్చు. అయితే, కచ్చితమైన ధర అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్‌పైనే ఆధారపడి ఉంటుంది.
రియల్‌మి GT 6T స్పెసిఫికేషన్లు :
రియల్‌మి GT 6T ఫోన్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్‌తో వస్తుంది. అయినప్పటికీ, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. IP65 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్, 6000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఉంటుంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కూడా ఉంది. మీరు 12GB ర్యామ్, 512GB స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లను కూడా ఎంచుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. డ్యూయల్-కెమెరా సెటప్‌లో 50MP, 8MP సెన్సార్లు ఉన్నాయి. అయితే, 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. రియల్‌మి GT 6T ఫోన్ 5500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.