Redmi Note 13 Pro gets massive discount
Redmi Note 13 Pro 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. రెడ్‌మి నోట్ 13ప్రో 5జీ ఫోన్ భారీగా తగ్గింది. రెడ్‌మి నోట్ 14 సిరీస్ లాంచ్ తర్వాత రెడ్‌మి నోట్ 13 సిరీస్ ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ప్రస్తుతం, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 28 వరకు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది.
ఈ సేల్ సమయంలో, రెడ్‌మి నోట్ 13 సిరీస్ నుంచి ప్రీమియం మోడల్ అసలు లాంచ్ ధర కన్నా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
రెడ్‌మి నోట్ 13 ప్రో ఫోన్ 12జీబీ వరకు ర్యామ్, 200ఎంపీ కెమెరాతో సహా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై పూర్తి డిస్కౌంట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్‌మి నోట్ 13 ప్రో డిస్కౌంట్ :
అత్యుత్తమ రెడ్‌మి నోట్ 13 ప్రో ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB, 8GB RAM + 256GB, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. ఆర్కిటిక్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, కోరల్ పర్పుల్ అనే మీరు 3 అద్భుతమైన కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.
8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ. 26,999కు సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ. 21,999కే అందుబాటులో ఉంది.
అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ ఫోన్ ధరను రూ.21,100 వరకు తగ్గించే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఉదాహరణకు.. మీ పాత ఫోన్ వాల్యూ రూ.7వేలు అయితే, మీరు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూ.15వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
రెడ్‌మి నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ రెడ్‌మి ఫోన్ 1.5K రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్‌లకు చేరుకునే గరిష్ట ప్రకాశంతో కూడిన పవర్‌ఫుల్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో పవర్ అందిస్తుంది. 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.
బ్యాక్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన అద్భుతమైన 200MP ప్రైమరీ సెన్సార్ (Samsung ISOCELL HP3), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
అయితే, ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం 16MPని అందిస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ఎక్కువ కాలం మన్నికతో పాటు దుమ్ము, నీటి నిరోధకతకు IP54 రేటింగ్ వంటివి ఉన్నాయి.