Redmi Note 14 Series : ఏఐ ఫీచర్లతో రెడ్‌మి నోట్ 14 సిరీస్ వచ్చేసింది.. మొత్తం 3 ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే!

Redmi Note 14 Series : రెడ్‌మి నోట్ 14ప్రో 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ వెర్షన్‌కు ధర రూ. 23,999, 8జీబీ+256జీబీ ఆప్షన్ ధర రూ. 25,999కు ఆఫర్‌లతో సహా అందుబాటులో ఉంటుంది.

Redmi Note 14 Series : ఏఐ ఫీచర్లతో రెడ్‌మి నోట్ 14 సిరీస్ వచ్చేసింది.. మొత్తం 3 ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే!

Redmi Note 14 series launched in India

Updated On : December 10, 2024 / 8:04 PM IST

Redmi Note 14 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి ఫోన్ నుంచి సరికొత్త రెడ్‌మి నోట్ 14 సిరీస్ ఇప్పుడు అధికారికంగా లాంచ్ అయింది. షావోమీ భారత మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ కెమెరా, ఏఐ ఫీచర్లతో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5జీ, రెడ్‌మి నోట్ 14 ప్రో, రెడ్‌మి నోట్ 14 అనే 3 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. రెడ్‌మి నోట్ 14ప్రో సిరీస్ నీరు, ధూళి నిరోధకతకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ68 రేటింగ్‌తో కర్వ్ డిజైన్, మన్నికను అందిస్తుంది.

ఇప్పుడు అధికారికంగా షావోమీ భారత మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ కెమెరా, ఏఐ ఫీచర్లతో 3 స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ, రెడ్‌మి నోట్ 14ప్రో, రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14ప్రో సిరీస్ నీరు, ధూళి నిరోధకతకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ68 రేటింగ్‌తో కర్వ్ డిజైన్, మన్నికను అందిస్తుంది. భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14ప్రో, రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ ధర, రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ 8జీబీ+128జీబీ వెర్షన్‌ ధర రూ. 29,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ. 31,999 ఆఫర్‌లతో సహా 12జీబీ+512జీబీ ఆప్షన్ రూ. 34,999 ధరకు అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 14ప్రో 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ వెర్షన్‌కు ధర రూ. 23,999, 8జీబీ+256జీబీ ఆప్షన్ ధర రూ. 25,999కు ఆఫర్‌లతో సహా అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 14 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్‌కు ధర రూ. 17,999, 8జీబీ+128జీబీ వెర్షన్‌కు ధర రూ. 18,999, 8జీబీ+256జీబీ ఆప్షన్ ధర రూ. 20,999 ఆఫర్‌లతో సహా అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 14 5జీ సిరీస్ ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, షావోమీ రిటైల్ స్టోర్‌లు, అధీకృత రిటైల్ పార్టనర్లలో 13 డిసెంబర్ 2024 నుంచి అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 14ప్రో 5జీ సిరీస్ ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్.ఇన్, షావోమీ అంతటా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 13 నుంచి రిటైల్ స్టోర్లు, అధీకృత రిటైల్ పార్టనర్ల వద్ద కొనుగోలు చేయొచ్చు. మొట్టమొదటిసారిగా, రెడ్‌మి నోట్ ప్రో యూజర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ స్పెక్టర్ బ్లూ, టైటాన్ బ్లాక్, స్పెషల్ ఫాంటమ్ పర్పుల్ వేగన్ లెదర్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. రెడ్‌మి నోట్ 14ప్రో 5జీ ఫోన్ ఐవీ గ్రీన్, టైటాన్ బ్లాక్ మొదటిసారిగా ప్రోలో డ్యూయల్-టోన్ వేగన్ లెదర్ ఫాంటమ్ పర్పుల్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. రెడ్‌మి నోట్ 14 మైస్టిక్యూ వైట్, ఫాంటమ్ పర్పల్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

రెడ్‌మి నోట్ 14 సిరీస్ ఆఫర్ వివరాలు :
వినియోగదారులు ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా రూ. 1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నో కాస్ట్ ఈఎంఐ లోన్‌లపై రూ. 1,000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 14ప్రో సిరీస్ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ, రెడ్‌మి నోట్ 14ప్రో 5జీ ఫీచర్లు 6.67-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే 1.5కె రిజల్యూషన్, 3000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్. డిస్‌ప్లే మన్నిక కోసం ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, బ్లాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీని పొందుతుంది. రెడ్‌మి నోట్ 14ప్రో, అయితే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్‌ను పొందుతుంది. షావోమీ హైపర్ఓఎస్ ద్వారా ఆధారితమైన ఈ సిరీస్ లైవ్ వీడియో సబ్ హెడ్డింగ్స్, లాంగ్వేజీ ట్రాన్సులేషన్, జెమిని ఏఐ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.

కెమెరా విభాగంలో రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ ఫ్లాగ్‌షిప్ 50ఎంపీ లైట్ ఫ్యూజన్ 800 కెమెరా, సూపర్ ఓఐఎస్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8ఎంపీ సోనీ అల్ట్రా-వైడ్ కెమెరా, 50ఎంపీ 2.5ఎక్స్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14ప్రో 5జీ ఏఐ బోకె, డైనమిక్ షాట్స్ వంటి ఏఐ-మెరుగైన ఫీచర్లతో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను అందిస్తుంది. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో షావోమీ అతిపెద్ద బ్యాటరీతో వస్తుంది. 90W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీతో పాటు 6200mAh బ్యాటరీని కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 14ప్రో 5500mAh బ్యాటరీ, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉంది. రెండు మోడల్స్ 4 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో వస్తాయి.

రెడ్‌మి నోట్ 14 5జీ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి నోట్ 14 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్‌ను కూడా పొందుతుంది. కెమెరాల విషయానికి వస్తే.. 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, మాక్రో లెన్స్‌తో వస్తుంది. ఈ ఫోన్ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Read Also : iQOO 13 First Sale : ఐక్యూ 13 ఫోన్ లాంచ్ ఆఫర్లు.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?