Reliance Jio Diwali Offer : రిలయన్స్ జియో దీపావళి ఆఫర్.. ప్రీపెయిడ్ యూజర్ల కోసం 2 సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే!

Reliance Jio Diwali Offer : రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్ కింద 2 సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. అందులో రూ. 899, రూ. 3,599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి.

Reliance Jio Diwali Offer : రిలయన్స్ జియో దీపావళి ఆఫర్.. ప్రీపెయిడ్ యూజర్ల కోసం 2 సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే!

Reliance Jio Diwali Offer

Updated On : October 25, 2024 / 5:13 PM IST

Reliance Jio Diwali Offer : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేకించి జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త “దీపావళి ధమాకా” ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద 2 సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. అందులో రూ. 899, రూ. 3,599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి.

వీటిపై జియో తమ ప్రీపెయిడ్ యూజర్లకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందిస్తోంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 2024 మధ్య ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు (EaseMyTrip, Ajio, Swiggy) వంటి బ్రాండ్‌ల నుంచి రూ. 3,350 విలువైన వోచర్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు.

జియో దీపావళి ఆఫర్ కింద ప్రకటించిన రూ.899 రూ.3599 ప్లాన్‌లలో 2జీబీ రోజువారీ డేటాను అదనంగా 20జీబీ బోనస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. 90 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది. రూ. 3599 ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఏడాది పాటు పొడిగించుకోవచ్చు. ఈ ప్రయోజనాలే కాకుండా రిలయన్స్ జియో కొన్ని వోచర్లను కూడా అందిస్తోంది. ఈజీమైట్రిప్, స్విగ్గీ వంటి ప్రముఖ బ్రాండ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

ఈజీమైట్రిప్ : హోటల్స్, విమాన ప్రయాణ బుకింగ్‌లపై రూ. 3వేల తగ్గింపు వోచర్
అజియో : రూ. 999 అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై రూ. 200 డిస్కౌంట్
స్విగ్గీ : ఫుడ్ ఆర్డర్ చేయడానికి రూ. 150 డిస్కౌంట్ వోచర్.

2024 జియో దీపావళి ధమాకా కూపన్‌లను ఎలా రీడీమ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జియో కొత్త ప్లాన్లతో రీఛార్జ్ చేసిన తర్వాత కస్టమర్‌లు మైజియో (MyJio) యాప్ ద్వారా వోచర్‌లను యాక్సెస్ చేయవచ్చు.

1. మైజియోలో “offers” సెక్షన్ క్లిక్ చేయండి.
2. “My winnings” క్లిక్ చేయండి.
3. కావలసిన కూపన్ కోడ్‌ని ఎంచుకుని కాపీ చేయండి.
4. క్యూరేటెడ్ పార్టనర్ లింక్‌ని ఫాలో చేయండి.
5. పార్టనర్ వెబ్‌సైట్‌లో చెక్అవుట్ వద్ద కోడ్‌ను అప్లయ్ చేయండి.

Read Also : Instagram Profile Cards : ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కార్డ్ అంటే ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఎక్కువ ఫాలోవర్లు ఎలా పెంచుకోవాలంటే?