వాడుకోండి…జియో ధర తగ్గింది…. డేటా పెరిగింది..

  • Published By: chvmurthy ,Published On : April 27, 2019 / 04:13 PM IST
వాడుకోండి…జియో ధర తగ్గింది…. డేటా పెరిగింది..

Updated On : April 27, 2019 / 4:13 PM IST

రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో.  ప్లాన్స్ ధరలు తగ్గడంతో పాటు డేటా పెరగడం కూడా వినియోగదారులకు  మరో మంచి అవకాశం. గతంలో రోజుకు 1 జీబీ డేటా పొందినవారికి ఇక  నుంచి 1.5 జీబీ డేటా  పోందవచ్చు. గతంలో రోజుకు 1.5 జీబీ డేటా పొందిన వారికి ఇకపై 2జీబీ డేటా లభిస్తుంది. గతంలో ఉన్న ప్లాన్స్‌కి ఇప్పుడు మారిన ప్లాన్స్‌కు మధ్య తేడా ఏంటీ? ధర ఎంత తగ్గింది? డేటా ఎంత పెరిగింది? మొదలైన  వివరాలు  ఓసారి  చూసుకోండి.

గతంలో రూ.199 ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.149 ధరకే లభిస్తోంది. గతంలో రూ.199 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు రూ.149 రీఛార్జ్ చేసుకుంటే  రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని కాలపరిమితి  28 రోజులు. మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.399 ఉన్న ప్లాన్ ఇకపై రూ.349 కే వస్తుంది. 70 రోజుల పాటు 105 జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.459 ఉన్న ప్లాన్‌ని ఇప్పుడు రూ.399 ధరకే పొందొచ్చు. మొత్తం 126 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు. గతంలో రూ.509 ఉన్న ప్లాన్‌ను రూ.499 ధరకే అందిస్తోంది జియో. దీనిలో 91 రోజుల పాటు 136.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.1,699 ప్లాన్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే గతంలో 365 జీబీ డేటా లభించేది. ఈ ప్లాన్ లో ఇకపై 547.5 జీబీ డేటా పొందొచ్చు. సంవత్సరంపాటు దీని కాలపరిమితి ఉంటుంది.