Sanjay Malhotra: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా.. ఆయన గురించి తెలుసా?

మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌.

Sanjay Malhotra: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా.. ఆయన గురించి తెలుసా?

Sanjay Malhotra

Updated On : December 9, 2024 / 7:38 PM IST

రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ నెల 11 నుంచి మూడేళ్లపాటు సంజయ్‌ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతల్లో ఉంటారు.

ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. ఆయన 2018లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2021లో ముగిసిన తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తూ అప్పట్లో కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 10న ఆ గడువు ముగియనుంది.

సంజయ్‌ మల్హోత్రా గురించి విశేషాలు

  • మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌
  • రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి
  • కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన మల్హోత్రా
  • ప్రిన్స్‌టన్ వర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్
  • కెరీర్‌లో పలు శాఖల్లో పనిచేసిన మల్హోత్రా
  • ఫైనాన్స్ సహా టాక్సేషన్, ఐటీ, గనులు, పవర్‌ శాఖల్లో బాధ్యతలు
  • ఆర్థిక రంగంలో మల్హోత్రాకు అనుభవం
  • ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో కీలక పాత్ర

ఇక తప్పదు.. అణ్వాయుధాలపైనే దృష్టిపెట్టిన ఇరాన్‌? ఎందుకంటే?