రూ.899కే విమాన టిక్కెట్

  • Published By: vamsi ,Published On : December 24, 2019 / 03:44 AM IST
రూ.899కే విమాన టిక్కెట్

Updated On : December 24, 2019 / 3:44 AM IST

కొత్త సంవత్సరం సంధర్భంగా విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు డబ్బులు మిగిలేలా చేసే వార్త ఇది. విమానంలో ప్రయాణించాలని అనుకునేవారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది విమానయాన సంస్థ ఇండిగో. టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం రూ.899కే విమాన టికెట్ పొందే అవకాశం ఉంది.

ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమాన ప్రయాణానికి ఫ్లైట్ టికెట్ ధర రూ.899 నుంచి ప్రారంభం అవుతుంటే, అదే అంతర్జాతీయ విమాన ప్రయాణానికి టికెట్ ధర రూ.2,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్నవారు జనవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ మధ్యకాలంలో ప్రయాణించవచ్చు. ఆఫర్‌లో భాగంగా టికెట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి. సీట్లు అందుబాటులో ఉన్నంత వరకే ఆఫర్ వర్తిస్తుంది.

అంతేకాదు ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకుంటే ఎలాంటి కన్వీనియన్స్ చార్జీలు ఉండవు. ఇండిగో వెబ్‌సైట్ లేదా ఇండిగో మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండిగో ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది ఇండిగో సంస్థ. అంతేకాకుండా టికెట్ బుకింగ్‌పై అదనంగా రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించింది.