amp domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /var/www/html/10tv/wp-includes/functions.php on line 6122Sam Altman, Greg Brockman and other former OpenAI employees to join Microsoft
Sam Altman to join Microsoft : ఏఐ టెక్నాలజీ చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన సామ్ ఆల్ట్‌మన్‌ను అర్థాంతరంగా ఓపెన్ఏఐ తొలగించింది. సంస్థ కోసం అన్నితానై ముందుడి నడిపిన ఆల్ట్‌మన్‌ను బయటకు పంపేసింది. కంపెనీ అభివృద్ధికి తాను చేసిన కృషిని మర్చిపోయి నీపై విశ్వాసం లేదంటూ వద్దు పొమ్మంది. అందుకే, సీఈఓ పదవికి సామ్‌తో రాజీనామా చేయించి ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓ మీరా మురాటికి బాధ్యతలు అప్పగించింది. ఆల్ట్‌మన్ తొలగింపుపై ఇతర ఏఐ స్టాఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సామ్ తొలగింపునకు నిరసనగా ఓపెన్‌ఏఐ సహ-వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్, మరికొందరు అగ్రశ్రేణి పరిశోధకులు కంపెనీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, ఓపెన్ ఏఐ స్టాఫ్ సైతం సీఈఓ సామ్ ఆల్టమన్‌ను తిరిగి నియమించాలని గట్టిగా పట్టుబడుతోంది. ఈ విషయంలో మైక్రోసాఫ్ట్ కూడా ఓపెన్ఏఐ బోర్డుపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే ఆల్ట్‌మన్‌కు మైక్రోసాఫ్ట్ అండగా నిలిచింది. తమ కంపెనీలోని ఏఐ బృందానికి నాయకత్వం వహించాలంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కంపెనీ అధినేత సత్యనాదెళ్ల ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆల్టమన్‌తో తానూ టచ్‌లోనే ఉన్నానని నాదెళ్ల తెలిపారు. ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మన్ మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో చేరి, అధునాతన ఏఐపై దృష్టి సారించి కొత్త బృందానికి నాయకత్వం వహిస్తారని ఆయన ప్రకటించారు.
అయినా ఓపెన్ఏఐతో కలిసి పనిచేస్తాం : సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఓపెన్‌ఏఐతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుందని, తమ కొత్త సీఈవో ఎమ్మెట్ షీర్‌ను తెలుసుకునేందుకు సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ చెప్పారు. కొత్త అధునాతన ఏఐ పరిశోధన బృందం, వారి విజయానికి అవసరమైన వనరులను అందించడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ఇప్పటికే, ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. శామ్ ఆల్టమన్‌ను తొలగించినప్పటికీ ఓపెన్ ఏఐతో పని చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని సత్య నాదెళ్ల ప్రకటించారు.
We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…
— Satya Nadella (@satyanadella) November 20, 2023
ఓపెన్ఏఐలో ఏమి జరిగింది? :
ఓపెన్ఏఐ సామ్ ఆల్ట్‌మన్ తొలగింపుపై ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. అతను బోర్డు నిర్ణయాలకు విరుద్ధంగా ఉన్నాడని పేర్కొంది. కంపెనీలో అగ్రగామిగా కొనసాగగల అతని సామర్థ్యంపై బోర్డుకి ఇకపై విశ్వాసం లేదని బ్లాగ్ పోస్టులో పేర్కొంది. సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటిని కంపెనీ తాత్కాలిక సీఈఓగా నియమిస్తున్నట్టు వెల్లడించింది. అయితే తాత్కాలిక సీఈవోగా మురాటి పదవీ కాలం ఎక్కువరోజులు కొనసాగలేదు. ఎందుకంటే.. ఆల్ట్‌మన్ బ్రోక్‌మాన్‌లను తిరిగి నియమించుకోవడానికి మురాటి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Sam Altman, Greg Brockman
ఓపెన్ఏఐ కొత్త సీఈఓగా ఎమ్మెట్ షీర్ :
సహ వ్యవస్థాపకుడు, బోర్డ్ డైరెక్టర్ ఇల్యా సుట్స్‌కేవర్ ప్రకారం.. ఆల్ట్‌మాన్ ఓపెన్ ఏఐ సీఈఓగా ఇక తిరిగి రాడు.. అతనిని తిరిగి తీసుకురావడానికి కంపెనీ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అతనిని తొలగించిన డైరెక్టర్ల బోర్డుతో వారాంతపు చర్చల తర్వాత సట్స్‌కేవర్ సిబ్బందికి తెలియజేశారు.
అమెజాన్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షీర్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని సట్స్‌కేవర్ తెలిపారు. ఈస్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ (TwitchTV) సీఈఓ సహ వ్యవస్థాపకుడిగా షీర్ పనిచేశారు. ఫిబ్రవరి 2023లో ట్విచ్‌కి షీర్ రాజీనామా చేశారు.