Samsung Galaxy F06 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. రూ. 10వేల లోపు ధరకే ఈ 5G ఫోన్ కొనేసుకోండి..!

Samsung Galaxy F06 5G : శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఇలా పొందవచ్చు.

Samsung Galaxy F06 5G

Samsung Galaxy F06 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ అభిమానులు అయితే మీకో గుడ్ న్యూస్.. స్టైలిష్, హై పర్ఫార్మెన్స్ ఫోన్ కోరుకుంటే.. శాంసంగ్ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ F06 5G చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Broadband Plan : 400Mbps, 22 OTT యాప్స్, 300కి పైగా టీవీ చానళ్లు.. సరసమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మీకోసం..!

తద్వారా శాంసంగ్ ఫోన్‌ను షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎలాంటి సేల్ లేకుండా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

5G కనెక్టివిటీతో శాంసంగ్ అన్ని 5G టెలికాం ఆపరేటర్లకు సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్స్, డిస్కౌంట్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ F06 5Gపై డిస్కౌంట్ ఆఫర్లు :
ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F06 5G ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి 39శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఈ తగ్గింపు తర్వాత శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ ధర రూ. 8499గానే ఉంటుంది. అదే సమయంలో మీరు ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

ఈ ఆఫర్ కింద కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మీకు రూ.7950 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.

అన్ని నిబంధనలు, షరతుల తర్వాత మీరు ఈ విలువను పొందవచ్చు. మీరు కోరుకుంటే రూ.2833 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F06 5G స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. 6.8-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది.

కెమెరా, బ్యాటరీ ఫీచర్లు :
కెమెరా ఫీచర్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP,సెకండరీ కెమెరా 2MP అయితే, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Read Also : OnePlus Nord 4 Price : ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై ఏకంగా రూ.25వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే.. WiFi, బ్లూటూత్, GPS వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.