Samsung Galaxy M56 : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ గెలాక్సీ M56 చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy M56 : శాంసంగ్ అభిమానులు తప్పక కొనాల్సిన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 26 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy M56
Samsung Galaxy M56 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్.. మీ బడ్జెట్ ధరలోనే మీకు నచ్చిన శాంసంగ్ గెలాక్సీ M56 కొనేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,204 ధరకు అందుబాటులో ఉంది. అదనంగా, వినియోగదారులు నిర్దిష్ట బ్యాంకులు, క్రెడిట్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M56 ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్, 6.73-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే, ఈ శాంసంగ్ గెలాక్సీ M56 ఫోన్ 256GB స్టోరేజీ, 8GB ర్యామ్ కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ M56 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ M56 ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ M56 ధర మొదట రూ.27,999గా ఉండగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,204కే అందుబాటులో ఉంది. రూ.6,795 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కస్టమర్లు నేరుగా ధర తగ్గింపుతో పాటు అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు.
మీరు కొత్త ఫోన్ మారాలనుకుంటే, ఈ-కామర్స్ దిగ్గజం మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ ప్రస్తుత ఫోన్ బ్రాండ్, మోడల్ కండిషన్ బట్టి రూ.17,250 వరకు ట్రేడ్-ఇన్ డిస్కౌంట్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M56 ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ M56 లో 6.73-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ డివైజ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1480 సీపీయూకి కనెక్ట్ అవుతాయి. అలాగే, శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అయ్యే వన్ యూఐ 7తో ఫ్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
ఈ శాంసంగ్ ఫోన్ ఆప్టిక్స్‌లో 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ OISతో కూడిన 50MP ప్రైమరీ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఆబ్జెక్ట్ ఎరేజర్‌లు ఎడిట్ ఇండికేషన్లతో సహా ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ల అన్ని గెలాక్సీ ఏఐ ఫొటోగ్రఫీ ఫంక్షన్‌లు సపోర్టు చేస్తాయి.
ఈ శాంసంగ్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అదనంగా, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ గాడ్జెట్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. చివరగా, కంపెనీ 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్, సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ కూడా అందిస్తుంది.
