SBI Loans Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు మరింత ప్రియం.. ఎన్ని పాయింట్లు పెరిగిందంటే?
SBI Loans Interest Rates : ఎస్బీఐ కూడా ఎంసీఎల్ఆర్ 3 నుంచి 6 నెలలకు పెంచింది. ఒక రోజు, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాల వ్యవధికి ఎంసీఎల్ఆర్ అలాగే ఉంచింది.

State Bank of India Hikes MCLR By 5 Basis Points
SBI Loans Interest Rates : బ్యాంకులో రుణాలు తీసుకునే వారికి షాకింగ్ న్యూస్.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ల రేట్లను అమాంతం పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేసడ్ లెండింగ్ రేట్లు (MCLR) సవరించింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలానికి కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎస్బీఐ బ్యాంకు లోన్లపై ఎంపిక చేసిన టెన్యూర్లపై లోన్ల రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ప్రధానంగా 3 నెలలు, 6 నెలలతో పాటు ఏడాది టెన్యూర్ లోన్లపై ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచింది. మొత్తంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు పెంచింది. ఈ సవరించిన లోన్ల వడ్డీ రేట్లు నవంబర్ 15 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతం నుంచి 9 శాతానికి పెంచింది. పర్సనల్, ఆటో, గృహ రుణాల రేటు కేవలం ఒక ఏడాదికి ఎంసీఎల్ఆర్ రేటు ద్వారా మాత్రమే నిర్ణయిస్తుంది.
3, 6 నెలల ఎంసీఎల్ఆర్ పెంపు :
ఎస్బీఐ కూడా ఎంసీఎల్ఆర్ 3 నుంచి 6 నెలలకు పెంచింది. ఒక రోజు, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాల వ్యవధికి ఎంసీఎల్ఆర్ అలాగే ఉంచింది. బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. బ్యాంక్ రుణ విభాగంలో 42 శాతం ఎంసీఎల్ఆర్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుందని తెలిపారు. మిగిలినవి బాహ్య బెంచ్‌మార్క్‌లపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ రేట్లు అత్యధిక స్థాయిలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే ఎంసీఎల్ఆర్ రెండుసార్లు పెంచింది. అదే సమయంలో, ఆర్బీఐ పాలసీ రేటు రెపోను వరుసగా 10వ సారి 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించింది. అయితే, రానున్న నెలల్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
అక్టోబర్‌లో భారత సీపీఐ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.1 శాతానికి ఎగబాకింది. ఆగస్టు తర్వాత ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 శాతం పరిమితిని అధిగమించడం ఇదే తొలిసారి. ఆహార ద్రవ్యోల్బణం 10.87 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాధానమిస్తూ.. డిసెంబర్ 2024 ద్రవ్య విధానానికి సంబంధించిన రేట్ యాక్షన్‌పై తన వ్యాఖ్యలను రిజర్వ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తదుపరి ఎంపీసీ సమావేశం డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 6 తేదీల్లో జరగనుంది.
షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ :
ఇటీవల, ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన మెచ్యూరిటీ పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం పెంచింది. ప్రామాణిక ఎంసీఎల్ఆర్ రేటు ఒక ఏడాది కాలానికి 9.45 శాతం వద్ద ఉంచింది. అయితే, ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.15 శాతానికి పెరిగింది. అయితే, ఒక నెల రేటు 0.05 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది. ఇతర మెచ్యూరిటీలతో కూడిన రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 7, 2024 నుంచి అమల్లోకి వచ్చేశాయి.
Read Also : India Safest Banks : దేశంలోనే అత్యంత సురక్షితమైన 3 బ్యాంకులివే.. ఆర్బీఐ కీలక ప్రకటన