SBI Users Attention : కస్టమర్లకు బిగ్ బ్రేకింగ్.. ఈ తేదీ నుంచి SBIలో mCASH సర్వీసు పనిచేయదు.. ఎందుకంటే? ఫుల్ డిటెయిల్స్..!

SBI Users Attention : ఎస్బీఐ mCASH కస్టమర్లు ఆన్‌లైన్ ఎస్‌బీఐ లేదా స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ ద్వారా పంపిన ఫండ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, డిసెంబర్ 1 నుంచి ఈ సర్వీసు పనిచేయదు.

SBI Users Attention : కస్టమర్లకు బిగ్ బ్రేకింగ్.. ఈ తేదీ నుంచి SBIలో mCASH సర్వీసు పనిచేయదు.. ఎందుకంటే? ఫుల్ డిటెయిల్స్..!

SBI Users Attention

Updated On : November 16, 2025 / 3:28 PM IST

SBI Users Attention : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్ల కోసం భారీ ప్రకటన చేసింది. ప్రభుత్వ బ్యాంక్ ప్రకారం.. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్‌లైన్‌ఎస్‌బీఐ, యోనో లైట్‌లలో mCASH సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది.

ఎస్బీఐ యూజర్లు తమ లబ్ధిదారుని పేరు (SBI Users Attention) రిజిస్టర్ చేయకుండా mCASH ఉపయోగించి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయలేరు. అలాగే, బ్యాంక కస్టమర్లు mCASH లింక్ లేదా యాప్ ఉపయోగించి డబ్బును పొందలేరు. ఈ సర్వీసుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబర్ 1 నుంచి ఏ SBI సర్వీసు పనిచేయదంటే? :
నవంబర్ 30 తర్వాత OnelineSBI, యోనో లైట్‌లో mCASH (పంపడం & క్లెయిమింగ్) సౌకర్యం అందుబాటులో ఉండదు. థర్డ్ పార్టీ లబ్ధిదారులకు డబ్బు పంపేందుకు దయచేసి UPI, IMPS, NEFT, RTGS వంటి ఇతర పేమెంట్స్ మెథడ్స్ ఉపయోగించండి” అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Read Also : Maruti Grand Vitara : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. మారుతి గ్రాండ్ విటారా రీకాల్.. మీ SUV కారులో ఈ సమస్య ఉందా? వెంటనే ఇలా చెక్ చేసుకోండి..!

స్టేట్ బ్యాంక్ mCASH అంటే ఏంటి? :
బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. స్టేట్ బ్యాంక్ mCASH అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఆన్‌లైన్ ఎస్‌బీఐ లేదా స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ ద్వారా పంపిన డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్న ఏ ఎస్‌బీఐ కస్టమర్ అయినా ఇప్పుడు లబ్ధిదారుడి రిజిస్ట్రేషన్ లేకుండా మొబైల్ నంబర్ లేదా లబ్ధిదారుడి ఇమెయిల్-ఐడి ద్వారా థర్డ పార్టీ ఫండ్స్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

మరోవైపు, ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉన్న ఖాతాదారుడు స్టేట్ బ్యాంక్ mCASH మొబైల్ యాప్ ద్వారా లేదా ఆన్‌లైన్‌ ఎస్బీఐలో mCASH లింక్ ద్వారా ఫండ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. డబ్బులు పొందే వ్యక్తికి SMS లేదా ఇమెయిల్‌లో లింక్‌ను పంపినవారు ఎంచుకున్న మీడియం ఆధారంగా 8 అంకెల పాస్‌కోడ్‌ను అందుకుంటారు.

ఖాతాదారుడు అకౌంట్ నంబర్, IFS కోడ్, పాస్‌కోడ్, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సరైన వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత రియల్ టైమ్ ఫండ్స్ కావాలసిన అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.