అమెరికా-ఇరాన్ గొడవలు: కుదేలైన మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లు కుదేలయ్యేందుకు కారణం అయ్యియి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరగడం, రూపాయి క్షీణించడంతో సూచీలు కుప్పకూలాయి. దీనికి తోడు దేశీయ కంపెనీల డిసెంబరు త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టిపెట్టడం మార్కెట్లు కుదేలు అవ్వడానికి కారణం అయ్యాయి.
ముదుపర్ల దృష్టి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయగా.. సోమవారం(06 జనవరి 2020) నాటి ట్రేడింగ్‌ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. 300 పాయింట్ల నష్టంతో మొదలైన బాంబే స్టాక్ మార్కెట్ కాసేనటికే దారుణంగా పడిపోయింది.
ఇవాళ ఉదయం 9.40 గంటల ప్రాంతంలో 459 పాయింట్లు నష్టపోయి 41,005 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 138 పాయింట్ల నష్టంతో 12,089 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 72.05గా ట్రేడ్ అవుతోంది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
