ServiceNow: ఇండియా ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన సర్వీస్‌నౌ
హైదరాబాద్‌లోని సర్వీస్‌నౌ ఇన్నోవేషన్ సెంటర్ భారతీయ సంస్థలు పనిచేసే విధానాన్ని, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంలో తోడ్పడటం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది

India Innovation Center: ప్రముఖ డిజిటల్ వర్క్‌ఫ్లో కంపెనీ, సర్వీస్‌నౌ గురువారం సర్వీస్‌నౌ యొక్క కొత్త ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇది భారతీయ సంస్థలకు డిజిటల్ ఇంక్యుబేషన్ హబ్ గా డిజిటల్ రోడ్‌మ్యాప్‌లైన GenAI, హైపర్ ఆటోమేషన్, లో-కోడ్ యాప్‌లు మోడల్ చేయడానికి, ప్రదర్శించడానికి, ఒత్తిడిని పరీక్షించడానికి తోడ్పడుతూనే కస్టమర్‌లు, ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించనుంది.
Babar Azam : అయ్యో.. ఆజాము..! సెంచరీ ఎక్కడ.. ఇంకో 87 పరుగులు చేసుంటేనా..?
ఈ ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీ వద్ద ఉంది. కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను విస్తరించటానికి, అనుకూలమైన డిజిటల్ బ్లూప్రింట్‌లను రూపొందించడంలో సహాయపడటానికి తొమ్మిది ప్రయోజన-నిర్మిత గదులను కలిగి ఉంది. భారతీయ పౌరులకు నైపుణ్యం కల్పించడానికి కట్టుబడి ఉన్న విద్యావేత్తలు, కస్టమర్‌లు, భాగస్వాములతో ప్రత్యేకంగా ఈ హబ్ ఆన్-డిమాండ్ ట్రైనింగ్ సెషన్‌లను కూడా నిర్వహించనుంది.
Indian Market: భారతదేశంలోని ఆ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న దుబాయ్ ఎకానమీ & టూరిజం
కాగా, ఈ సెంటర్ ప్రారంభ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని సర్వీస్‌నౌ ఇన్నోవేషన్ సెంటర్ భారతీయ సంస్థలు పనిచేసే విధానాన్ని, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంలో తోడ్పడటం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది. ఈ పెట్టుబడి రాష్ట్రానికి, ప్రజలకు అవకాశాలను తీసుకురావడమే కాకుండా ప్రముఖ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతుంది. సర్వీస్‌నౌ యొక్క వృద్ధి కథలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము’’ అని అన్నారు.