Primebook 4G Laptop Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? రూ. 16వేల లోపు ధరకే ప్రైమ్‌బుక్ 4G ల్యాప్‌టాప్ సొంతం చేసుకోండి..!

Primebook 4G Laptop Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకోసం అత్యంత సరసమైన ధరకే సరికొత్త 4G ల్యాప్‌టాప్ సేల్ ఆఫర్‌కు అందుబాటులో ఉంది. మీరు రూ. 20వేల లోపు ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా?

Primebook 4G Laptop Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? రూ. 16వేల లోపు ధరకే ప్రైమ్‌బుక్ 4G ల్యాప్‌టాప్ సొంతం చేసుకోండి..!

Primebook 4G Laptop Sale _ Shark Tank funded laptop Primebook 4G to go on sale under Rs 16,000 in India

Updated On : March 2, 2023 / 11:09 PM IST

Primebook 4G Laptop Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీకోసం అత్యంత సరసమైన ధరకే సరికొత్త 4G ల్యాప్‌టాప్ సేల్ ఆఫర్‌కు అందుబాటులో ఉంది. మీరు రూ. 20వేల లోపు ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఒకవేళ స్టూటెండ్ అయితే.. షార్క్ ట్యాంక్ (Shark Tank) మీకోసం తగ్గింపు ధరకే కొత్త 4G ల్యాప్‌టాప్ ఆఫర్ చేస్తోంది.

షార్క్ ట్యాంక్ సీజన్ 2 నిధులతో కూడిన ఆండ్రాయిడ్ OS ఆధారిత ల్యాప్‌టాప్‌లో ఒకటైన Primebook 4Gని కొనుగోలుకు రెడీగా ఉంది. సరసమైన ల్యాప్‌టాప్ మార్చి 11, 2023న అందుబాటులోకి రావడానికి రెడీగా ఉంది. ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా Flipkartలో లాంచ్ అవుతుంది. ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించారు. తద్వారా విద్యార్థులు అధిక ధర, పర్ఫార్మెన్స్ రేషియోను కలిగిన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి e-లెర్నింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

భారత మార్కెట్లో రూ. 20వేల లోపు ల్యాప్‌టాప్‌ను అందించేందుకు ప్రైమ్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, CMO అమన్ వర్మ మాట్లాడుతూ.. ‘ఎడ్-టెక్ పరిశ్రమ ఇప్పటివరకు కంటెంట్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. విద్యార్ధులు నేర్చుకునేందుకు టెక్ ఎనేబుల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్నాయి. భారత్‌లో 23 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవు. ఇ-లెర్నింగ్ గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు ల్యాప్‌టాప్స్ వినియోగం చాలా అవసరం.

Read Also : Best Laptops in India 2023 : ఈ మార్చిలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ కొనేసుకోండి..!

ఈ డిజిటల్ సంబంధిత సమస్యలను తగ్గించడానికి ప్రైమ్‌బుక్ 4Gని ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Sale)తో భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించడానికి మా బృందం చేసిన అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా ఈ డివైజ్ శక్తివంతమైనదిగా తయారైంది. విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికి ఈ ప్రైమ్‌బుక్ 4G ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Primebook 4G Laptop Sale _ Shark Tank funded laptop Primebook 4G to go on sale under Rs 16,000 in India

Primebook 4G Laptop Sale _ Shark Tank funded laptop Primebook 4G to go on sale

ప్రైమ్‌బుక్ 4G ధర ఎంతంటే? :
షార్క్ ట్యాంకు ప్రైమ్‌బుక్ 4G ల్యాప్‌టాప్ అసలు ధర రూ.16,990గా ఉంది. అయితే, వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,990 తగ్గింపు ధరతో డివైజ్ సొంతం చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ చాలా తేలికైనది. అందులోనూ ఎక్కడైనా ఈజీగా క్యారీ చేసేందుకు వీలుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

అకడమిక్ స్టడీస్, వృత్తిపరమైన ట్రైనింగ్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అనేక రకాల విద్యా ప్రయోజనాలకు ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ల్యాప్‌టాప్‌ను విద్యార్థులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రైమ్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ కలిసి 24 నెలల వరకు No-Cost EMI, కస్టమర్‌లకు రూ. 12వేల వరకు విలువైన ఇతర డిస్కౌంట్‌లతో సహా పలు బెనిఫిట్స్ అందించనున్నాయి.

ప్రైమ్‌బుక్ 4G స్పెసిఫికేషన్‌లు ఇవే :
ప్రైమ్‌బుక్ (Primebook 4G) ల్యాప్‌టాప్ 4G వైర్‌లెస్ సిమ్ కార్డ్‌తో వస్తుంది. మీరు ఇంటర్నెట్‌కి సులభంగా కనెక్ట్ చేయవచ్చు. Android 11 ఆధారంగా బ్రాండ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ PrimeOSని ఉపయోగిస్తుంది. PrimeOS ఆపరేటింగ్ సిస్టమ్ 200కి పైగా విద్యాపరమైన యాప్‌లతో టెస్టింగ్ అయింది. విద్యార్థులకు కూడా అన్ని యాప్స్ యాక్సెస్‌ని అందిస్తుంది. ప్రైమ్ స్టోర్ ద్వారా 10వేల ఆండ్రాయిడ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ల్యాప్‌టాప్‌తో మీరు ఒకేసారి మల్టీ విండోలను ఓపెన్ చేయొచ్చు. ఒకే ధర వద్ద ఫోన్ లేదా టాబ్లెట్‌ని ఉపయోగించడం కన్నా నేర్చుకునేందుకు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రైమ్‌బుక్ 4G MediaTek MT8788 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 64GB స్టోరేజీతో వస్తుంది (200 GBకి విస్తరించవచ్చు). నేటి ప్రపంచంలో నేర్చుకోవడానికి ముఖ్యమైన డాక్యుమెంట్‌లు, ఫొటోలు, వీడియోలకు అవసరమైన డిస్క్ మెమెరీని అందిస్తుంది.

Read Also : Scammers Fraud Messages : ఈ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. స్కామర్లతో జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? క్లిక్ చేస్తే ఖతమే..!