Simple One: రికార్డ్ స్థాయిలో బుకింగ్స్.. ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరిగిన డిమాండ్!
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 30వేలకు పైగా బుకింగ్ చేసుకున్నారు.

Bike
Simple One: ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం భారత్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. OLA ఎలక్ట్రిక్ స్కూటర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభించిన తర్వాత, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 30వేలకు పైగా బుకింగ్ చేసుకున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెంగుళూరు ఆధారిత తయారీదారుచే అభివృద్ధి చేయగా.. కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 1947 టోకెన్ ధరతో బుక్ చేసుకోవచ్చునని కంపెనీ ప్రకటించింది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఆదర్శవంతమైన డ్రైవింగ్ పరిస్థితులలో 236కిలో మీటర్ల అందిస్తుంది అని కంపెనీ తెలిపింది. సింపుల్ వన్‌లో అందించే ఎకో మోడ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 203 కిమీ రేంజ్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ అందించే గరిష్ట వేగం గంటకు 105 కిమీ. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ స్కూటర్లు వస్తూ వస్తూనే సంచలనం క్రియేట్ చేశాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉన్న మార్కును ఇవి తుడిపేసి కొత్త మార్కును క్రియేట్ చేశాయి.
ఓలా ఎలక్ట్రిక్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటలలోపే లక్ష మంది బుక్ చేసుకోగా.. ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఓలా కంపెనీకి ధీటుగా అంతే స్థాయిలో బుకింగ్స్ వచ్చినట్టు బెంగళూరు స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రికార్డు స్థాయిలో బుకింగ్‌లు వచ్చాయి.