SIP Calculator : మీకు ఈ నెల జీతం పడిందా? SIPలో జస్ట్ నెలకు రూ. 6వేలు పెట్టుబడి చాలు.. 25 ఏళ్లలో కోటీశ్వరులు అయిపోవచ్చు!
SIP Calculator : జీతం పడిన వెంటనే SIPలో నెలకు రూ. 6వేలతో పెట్టుబడి పెట్టండి. తద్వారా కేవలం 25 ఏళ్లలో కోటీశ్వరులు అవుతారు.. ఇదేలా సాధ్యమంటే?

SIP Calculator
SIP Calculator : మీకు నెల జీతం పడిందా? అయితే, జీతం డబ్బులను సరైన ప్లేసులో పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో రాబడిని పొందాలంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అద్భుతమైన ప్లాన్. SIP ద్వారా ప్రతి నెలా (SIP Calculator) మ్యూచువల్ ఫండ్లలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.
ఇందులో చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. మీరు ప్రతి నెలా రూ. 6వేలతో SIPని ప్రారంభించి 5 ఏళ్లు, 10 ఏళ్లు, 15 ఏళ్లు లేదా 20 సంవత్సరాలు నిరంతరం కొనసాగిస్తే.. మీ పెట్టుబడిపై ఊహించని రాబడిని పొందుతారు.
అంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లు సంపాదిస్తారు. కేవలం 25 ఏళ్లలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు అనమాట.. SIP క్యాలికేటర్ సాయంతో రూ. 6వేలు SIPతో ఎంత రాబడిని పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SIP అంటే ఏంటి? :
SIP అంటే.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (Systematic Investment Plan) మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన మార్గం. ఇందులో ప్రతి నెలా, త్రైమాసికంలో లేదా సంవత్సరానికి ఒక స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. రికరింగ్ డిపాజిట్ (RD) మాదిరిగానే ఈ SIP ప్లాన్ ఉంటుంది. కానీ, ఇక్కడ మీ డబ్బు స్టాక్ మార్కెట్‌కు లింక్ అయి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. దీనిపై రాబడి అవకాశం RD కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది.
SIP ప్లాన్ ప్రయోజనాలివే :
ప్రతి నెలా స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. హెచ్చుతగ్గుల మార్కెట్లో మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లను.. మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. తద్వారా మీ సగటు ఖర్చును తగ్గుతుంది. మీ డబ్బు ప్రిన్సిపల్‌పై మాత్రమే కాకుండా దానిపై వచ్చే రాబడిపై కూడా మంచి రాబడిని అందిస్తుంది. దీర్ఘకాలికంగా మీ మొత్తం భారీగా పెరుగుతూ పోతుంది.
రూ. 6వేల నెలవారీ SIPతో ఎంత రాబడి వస్తుందంటే? :
మీరు నెలకు రూ. 6వేలు SIPతో 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు పెట్టుబడి పెడుతూ పోతే భారీ మొత్తంలో రాబడి వస్తుంది. సగటున 12శాతం వార్షిక రాబడి అంచనాతో దీర్ఘకాలికంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో అధిక మొత్తంలో రాబడి పొందవచ్చు.
5 సంవత్సరాలలో ఎంత రాబడి వస్తుంది? :
మీరు నెలకు రూ. 6వేలు SIP చేస్తే..
మొత్తం పెట్టుబడి : రూ. 3,60,000 (రూ. 6వేలు × 60 నెలలు)
అంచనా రాబడి : రూ. 4,86,622
నికర లాభం : దాదాపు 35.17 శాతం
కేవలం 5 ఏళ్లలో మీ పెట్టుబడి దాదాపు రూ. 1.26 లక్షలు
10 ఏళ్లలో ఎంత రాబడి వస్తుంది? :
మీరు నెలకు రూ. 6వేలు SIPని 10 ఏళ్లు కొనసాగిస్తే..
మొత్తం పెట్టుబడి : రూ. 7,20,000 (రూ.6వేలు × 120 నెలలు)
అంచనా రాబడి : రూ. 13,44,215
నికర లాభం : దాదాపు 86.70 శాతం
10 ఏళ్లలో మీ పెట్టుబడి దాదాపు రెట్టింపు అవుతుంది. మీకు రూ. 6.24 లక్షలకు పైగా లాభం వస్తుంది.
15 ఏళ్ల రాబడి ఎంతంటే? :
15 ఏళ్ల పాటు నెలవారీ రూ.6వేల SIPతో కొనసాగిస్తే..
మొత్తం పెట్టుబడి : రూ. 10,80,000 (రూ. 6వేలు × 180 నెలలు)
అంచనా రాబడి : రూ. 28,55,588
నికర లాభం : దాదాపు 164.40 శాతం
పెట్టుబడి దాదాపు రూ. 17.75 లక్షల నికర లాభం.
మీ అసలు పెట్టుబడికి 1.5 రెట్లు ఎక్కువ వస్తుంది.
20 ఏళ్లలో ఎంత రాబడి వస్తుంది? :
మీరు రూ. 6వేల SIPతో 20 ఏళ్లు కొనసాగిస్తే..
మొత్తం పెట్టుబడి : రూ.14,40,000 (రూ. 6వేలు × 240 నెలలు)
అంచనా రాబడి : రూ. 55,19,144
నికర లాభం : సుమారు 283.27 శాతం
మీ అసలు పెట్టుబడితో రూ. 40.79 లక్షలకు పైగా లాభం వస్తుంది.
మొత్తం పెట్టుబడి : రూ. 18లక్షలు (రూ.6వేలు × 300 నెలలు)
అంచనా రాబడి : రూ. 1,02,13,239 (కోటికి పైగా)
నికర లాభం : దాదాపు 467.40 శాతం
25 ఏళ్లలో రూ. 6వేలు SIPతో కోటీశ్వరుడు ఎలా? :
నెలవారీ రూ. 6వేల SIPని 25 ఏళ్ల పాటు కొనసాగిస్తే.. మొత్తం పెట్టుబడి రూ. 18 లక్షలు అవుతుంది. మీ పెట్టుబడిపై రూ. 84 లక్షలకు పైగా నికర లాభం ఇస్తుంది. కానీ, సగటున 12శాతం వార్షిక రాబడితో మొత్తం అంచనా రాబడి రూ. 1,02,13,239 (సుమారుగా 1.02 కోట్లు) కావచ్చు. చక్రవడ్డీతో మీ డబ్బు కాలక్రమేణా భారీగా పెరుగుతుంది. 25 ఏళ్లలో కోటీశ్వరుడు అవుతారు. దీర్ఘకాలిక పెట్టుబడితో ఇల్లు కొనడం, పిల్లల విద్య లేదా రిటైర్మెంట్ వంటి ఆర్థిక అవసరాలన్నింటిని తీర్చుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం పెట్టుబడిపై అవగాహన కోసం మాత్రమే.. SIP వంటి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి..