Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన.. ఈ ప్రభుత్వ పథకంలో ఇలా చేరితే.. ప్రతి నెలా రూ. 10వేలు పెన్షన్.. భార్యాభర్తలకు ఫుల్ బెనిఫిట్స్..!
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. ప్రతినెలా రూ. 10వేలు పెన్షన్ పొందవచ్చు.

Atal Pension Yojana
Atal Pension Yojana : ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఏ పథకంలో పెట్టుబడి పెడితే అధిక పెన్షన్ పొందవచ్చునో తెలుసా? మీకోసం కేంద్ర ప్రభుత్వం (Atal Pension Yojana ) ఆధ్వర్యంలో అందించే అటల్ పెన్షన్ యోజన ద్వారా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి నెలా రూ. 5వేలు పెన్షన్ పొందవచ్చు.
అంతే కాదు.. ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెలా రూ. 10వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి.
పథకం ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వ పథకంలో చేరేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్ పొందాలంటే ఎంత మొత్తంలో ఎలా పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అటల్ పెన్షన్ యోజన ఏంటి? :
కేంద్ర ప్రభుత్వమే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ అందించనుంది. పెట్టుబడి ఎంత ఉంటే.. పెన్షన్ కూడా అంతే ఉంటుంది. మీరు ఒక వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్ కోసం పొందవచ్చు.
వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన ఇబ్బంది ఉండదు. అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి, కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. మీరు 20 ఏళ్లు లేదా 30 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరవచ్చు. ప్రతి నెలా రూ. 5వేలు, రూ. 10వేలు పెన్షన్ సులభంగా పొందవచ్చు.
రూ. 10వేలు పెన్షన్ ఎలా పొందాలి? :
అటల్ పెన్షన్ యోజన పథకం (Atal Pension Yojana) ఎంచుకోవడం ద్వారా ప్రతి నెలా బంపర్ బెనిఫిట్స్ పొందవచ్చు. 18 ఏళ్ల వయస్సులో నెలకు గరిష్టంగా రూ. 5వేలు పెన్షన్ పొందాలంటే మీరు నెలకు రూ. 210 చెల్లించాలి. 25 ఏళ్ల వయస్సులో చేరితే.. మీరు ప్రతి నెలా రూ. 376 చెల్లించాలి.. 30 ఏళ్ల వయస్సు ఉన్నవారికి ఈ కాంట్రిబ్యూషన్ రూ. 577, 35 ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ. 902, 39 ఏళ్ల వయస్సు ఉన్నవారు అయితే రూ. 1318 చెల్లించాలి. భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. అనుగుణంగా పథకంలో పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ల తర్వాత ఇద్దరికి కలిపి ప్రతి నెలా రూ. 10వేలు పెన్షన్ మొదలవుతుంది.
పథకం ప్రయోజనాలను ఎలా పొందాలి? :
- మీరు ముందుగా సమీపంలోని బ్యాంకుకు వెళ్లాలి.
- ఆ తరువాత, మీ e-KYC ప్రక్రియ కోసం సంబంధిత అధికారిని కలవండి.
- మీరు ఒక ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఆపై మీ దరఖాస్తు ప్రాసెస్ చేస్తారు.
- మీకు ఒక రసీదు ఇస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం అది మీ దగ్గరే పెట్టుకోండి.
- ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం కట్ అవుతుంది.