Oppo Reno 14 5G Series : ఒప్పో ఫ్యాన్స్ మీకోసమే.. రెనో 14 5G సిరీస్ ఆగయా.. ఏకంగా రెండు ఫోన్లు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

Oppo Reno 14 5G Series : ఒప్పో నుంచి రెండు కొత్త 5G సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. మీడియాటెక్ డైమన్సిటీ 8450 SOCతో రెనో 14 ప్రో సిరీస్ మీకోసం..

Oppo Reno 14 5G Series : ఒప్పో ఫ్యాన్స్ మీకోసమే.. రెనో 14 5G సిరీస్ ఆగయా.. ఏకంగా రెండు ఫోన్లు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

Oppo Reno 14 5G Series

Updated On : July 3, 2025 / 3:41 PM IST

Oppo Reno 14 5G Series : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో రెనో 14 5G సిరీస్ వచ్చేసింది. ఒప్పో రెనో 14 5G బేస్, ప్రో వేరియంట్ (Oppo Reno 14 5G Series) లాంచ్ అయ్యాయి. ఒప్పో రెనో 14 ప్రో వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్ ఉంది.

బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC ఉంది. వెనిల్లా వెర్షన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది. ప్రో మోడల్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh బ్యాటరీ ఉంది. ఈ రెండు ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లతో వచ్చాయి. 50MP ప్రైమరీ రియర్ కెమెరాలు, 50MP సెల్ఫీ షూటర్లు ఉన్నాయి.

ఒప్పో రెనో 14 ప్రో సిరీస్ ధర ఎంతంటే? :
దేశ మార్కెట్లో ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 49,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 54,999, పెర్ల్ వైట్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో రెనో 14 5G మోడల్ బేస్ 8GB + 256GB ఆప్షన్‌ ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది.

12GB + 256GB, 12GB + 512GB వేరియంట్లు వరుసగా రూ. 39,999, రూ. 42,999 ధరలకు లభిస్తాయి. ఫారెస్ట్ గ్రీన్, పెర్ల్ వైట్ షేడ్స్‌లో లభిస్తుంది. ఒప్పో రెనో 14 5G సిరీస్ జూలై 8 నుంచి ఒప్పో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఒప్పో రెనో 14 ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్ 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) LTPS OLED డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్ లెవల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, స్ప్లాష్, గ్లోవ్ టచ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8450 SoC ద్వారా 12GB ర్యామ్, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత (ColorOS 15.0.2) అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. గూగుల్ జెమిని సపోర్టుతో పాటు ఏఐ అన్‌బ్లర్, ఏఐ రీకంపోజ్, ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ మైండ్ స్పేస్ వంటి ఇతర ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Read Also : Ola, Uber Charges : ప్రయాణికులకు బిగ్ షాక్.. పీక్ అవర్స్‌లో ఓలా, ఉబర్, ర్యాపిడో డబుల్ ఛార్జీలు.. ఏయే సమయాల్లో ఎంతంటే?

కెమెరా సెగ్మంట్‌లో ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్ 50MP ప్రైమరీ రియర్ సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంది. ఈ 2 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టు కలిగి ఉన్నాయి. 60fps వద్ద 4K HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి. 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది.

ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్ 6,200mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W సూపర్‌వూక్, 50W (AirVOOC) ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ eSIM, 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్‌తో డ్యూయల్ నానో-సిమ్‌కు సపోర్టు ఇస్తుంది.

Oppo Reno 14 5G Series

Oppo Reno 14 5G Series

ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ కలిగి ఉంది. ఒప్పో రెనో ఫోన్ బరువు 201 గ్రాములు ఉండగా, టైటానియం గ్రే వేరియంట్ 163.35×76.98×7.48mmతో వస్తుంది. పెర్ల్ వైట్ మోడల్ 7.58mm మందంతో వస్తుంది.

ఒప్పో రెనో 14 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 14 5G వెనిల్లా మోడల్ చిన్నపాటి 6.59-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో వస్తుంది. 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఒప్పో ప్రో మోడల్‌ మాదిరిగా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వదు. OS, బిల్డ్, కనెక్టివిటీ ఫీచర్లు ప్రో వెర్షన్‌తో సమానంగా ఉంటాయి. కెమెరా సెటప్ కూడా సమానంగా ఉంటుంది. కానీ, 50MP అల్ట్రావైడ్ కెమెరాకు బదులుగా బేస్ వెర్షన్‌లో 8MP అల్ట్రావైడ్ యూనిట్ ఉంటుంది.