Ola, Uber Charges : ప్రయాణికులకు బిగ్ షాక్.. పీక్ అవర్స్‌లో ఓలా, ఉబర్, ర్యాపిడో డబుల్ ఛార్జీలు.. ఏయే సమయాల్లో ఎంతంటే?

Ola, Uber Charges : క్యాబ్ రైడ్ ప్రైమరీ ఛార్జీ రూ. 100 అయితే, క్యాబ్ ప్రొవైడర్లు కనీస ఛార్జీ రూ. 50, సర్జ్ ప్రైసింగ్ కింద రూ. 200 వరకు..

Ola, Uber Charges : ప్రయాణికులకు బిగ్ షాక్.. పీక్ అవర్స్‌లో ఓలా, ఉబర్, ర్యాపిడో డబుల్ ఛార్జీలు.. ఏయే సమయాల్లో ఎంతంటే?

Ola, Uber Charges

Updated On : July 3, 2025 / 2:42 PM IST

Ola, Uber Charges : క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా? అతి త్వరలో క్యాబ్ ఛార్జీలు రెట్టింపు కానున్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో ఇకపై రద్దీ సమయాల్లో ఛార్జీలను రెట్టింపు వరకు వసూలు చేయవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు (MVAG) 2025ను జారీ చేసింది.

ఈ యాప్ ఆధారిత టాక్సీ సర్వీసులకు సంబంధించి కొత్త నిబంధనలను 3 నెలల్లోపు (సెప్టెంబర్ నాటికి) అమలు చేయాలని ప్రభుత్వం కోరింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పుడు ఈ క్యాబ్ అగ్రిగేటర్లు పీక్ సమయంలో బేస్ ఛార్జీకి రెండింతలు వసూలు చేయవచ్చు. అయితే గతంలో ఈ పరిమితి 1.5 రెట్లు వరకు ఉండేది.

పీక్ అవర్స్ ఏంటి? :
పీక్ అవర్స్ అంటే.. రోడ్లపై ఎక్కువ ట్రాఫిక్ ఉండే సమయం, క్యాబ్‌లకు డిమాండ్ పెరిగే సమయం. చెడు వాతావరణం కారణంగా ప్రజలు ఎక్కువ క్యాబ్‌లను బుక్ చేసుకునే సమయం. సాధారణంగా ఉదయం 8-11 గంటల నుంచి సాయంత్రం 5గంటల నుంచి 9 గంటల మధ్య ఉంటుంది. వర్షం, పండుగలు లేదా బిగ్ ఈవెంట్‌ల సమయంలో కూడా పీక్ అవర్స్ ఉండొచ్చు. ఇలాంటి సమయాల్లో క్యాబ్ ధరలు ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటాయి.

కొత్త నిబంధనల ప్రకారం.. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో ఛార్జీ బేస్ ఫేర్‌లో కనీసం 50శాతం ఉంటుంది. మధ్యాహ్నం లేదా రాత్రిపూట మాదిరిగా కనీస ఛార్జీ బేస్ ఫేర్‌లో 50శాతం ఉంటుంది. రైడ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీలు బేస్ ఫేర్ కన్నా తక్కువ వసూలు చేయలేవు. ఈ కొత్త సవరించిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 3 నెలల సమయం ఉంది.

Read Also : WhatsApp Privacy : బిగ్ అలర్ట్.. మీ వాట్సాప్‌ చాట్ డేంజర్‌లో.. ఈ 5 ప్రైవసీ సెట్టింగ్స్ ఇప్పుడే ఎనేబుల్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

బేస్ ఫేర్ ఎంతంటే? :
బేస్ ఫేర్ అనేది క్యాబ్, ఆటో-రిక్షా లేదా బైక్ టాక్సీకి నిర్దిష్ట దూరం లేదా సమయానికి నిర్ణయించే ప్రాథమిక ఛార్జీ. రవాణా నియమాలు రాష్ట్రాల అధికార పరిధిలోకి వస్తాయి. ఈ ఛార్జీని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. బేస్ ఫేర్ సిటీ, వెహికల్ టైప్ (సెడాన్, SUV, ఆటో లేదా బైక్ వంటివి) స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

డ్రైవర్ రైడ్ క్యాన్సిల్స్ చేస్తే పెనాల్టీ :
డ్రైవర్ రైడ్‌ను అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా రద్దు చేస్తే.. అతనికి బేస్ ఫేర్‌లో 10శాతం పెనాల్టీ పడుతుంది. గరిష్టంగా రూ. 100 వరకు పెనాల్టీ ఉండవచ్చు. డ్రైవర్లు రీజన్ లేకుండా రద్దు చేయలేరు.

కొత్త నిబంధనలు అమల్లోకి ఎప్పుడంటే? :
ఈ కొత్త నిబంధనలను రాబోయే 3 నెలల్లో అంటే సెప్టెంబర్ 2025 నాటికి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని డ్రైవర్లకు వారి భద్రతకు రూ. 5 లక్షల వరకు బీమా కవర్ తప్పనిసరి చేసింది.

ఒక రైడ్ బేస్ ఫేర్ రూ. 100 అయితే.. క్యాబ్ ప్రొవైడర్లు వసూలు చేయాల్సిన కనీస ధర రూ. 50, సర్జ్ ప్రైసింగ్ కింద రూ. 200 వరకు తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వాహన కేటగిరీకి బేస్ ఫేర్లను నిర్ణయిస్తారు. “ప్రయాణికుడు లేకుండా ప్రయాణించిన దూరం, ప్రయాణీకులను ఎక్కించుకోవడం సహా డెడ్ మైలేజీకి కనీసం 3 కిలోమీటర్ల వరకు బేస్ ఛార్జీ వసూలు చేస్తుందని (MORTH) పాలసీలో పేర్కొంది.

పికప్ పాయింట్ క్యాబ్ ఉన్న ప్రదేశం నుంచి 3 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్నప్పుడు తప్ప డెడ్ మైలేజీకి ఏ ప్రయాణీకుడి నుంచి ఛార్జీ విధించరాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. దూరం 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఛార్జీ పికప్ నుంచి డ్రాప్-ఆఫ్ వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణీకుడి నుంచి ప్రయాణించిన దూరానికి కాదు.

క్యాన్సిల్ ఛార్జీలలో మార్పు లేదు :
యాప్‌లో కన్ఫర్మేషన్ తర్వాత ప్రయాణీకుడు బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. సరైన కారణం లేకుండా రద్దు అయితే ఛార్జీలో 10 శాతం, రూ. 100 మించకుండా రుసుము వసూలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.