WhatsApp Privacy : బిగ్ అలర్ట్.. మీ వాట్సాప్ చాట్ డేంజర్‌లో.. ఈ 5 ప్రైవసీ సెట్టింగ్స్ ఇప్పుడే ఎనేబుల్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
WhatsApp Privacy : వాట్సాప్ చాట్ ప్రైవసీ కోసం 5 అద్భుతమైన టిప్స్ తప్పక తెలుసుకోండి.. ఇలా ఎనేబుల్ చేస్తే చాట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

WhatsApp Privacy
WhatsApp Privacy : వాట్సాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ వాట్సాప్ చాట్ ప్రైవసీ భద్రమేనా? వాట్సాప్‌లో మీకు తెలియకుండానే కొన్నిసార్లు మీ డేటాను (WhatsApp Privacy) యాక్సస్ చేసే ప్రమాదం ఉంది. అందుకే వాట్సాప్ వాడే యూజర్లు తప్పనిసరిగా ప్రైవసీ సెట్టింగ్స్ ఆన్ చేయాలి.
ఈ 5 ఫీచర్లలో మీ చాట్స్, వ్యక్తిగత డేటాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. గుర్తుతెలియని వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్ చాట్‌లో 5 ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ఆన్ చేయండి :
వాట్సాప్ ఇప్పటికే మీ చాట్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. కానీ, ఇప్పుడు మీ చాట్ బ్యాకప్‌లను కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, గూగుల్ లేదా ఆపిల్ కూడా మీ మెసేజ్‌లు చూడలేవు.
ఎలా ఆన్ చేయాలి :
Settings > Chats > Chat Backup > End-to-End Encrypted Backupకు వెళ్లండి.
ఒక పాస్‌వర్డ్ లేదా ఒక స్పెషల్ 64-అంకెల Key క్రియేట్ చేయండి. ఆపై Done ట్యాప్ చేయండి.
2. అడ్వాన్స్ చాట్ ప్రైవసీ :
ఈ సెట్టింగ్ కొన్ని చాట్స్ నుంచి ఫొటోలు, వీడియోలు లేదా మెసేజ్‌లు ఇతరులు సేవ్ చేయకుండా ఆపుతుంది. ప్రైవేట్ చాట్స్ మరింత సేఫ్ ఉండొచ్చు.
Open Chat > Tap Chat Name > Advanced Chat Privacy > Change Settings
3. టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ WhatsApp Privacy :
మీ వాట్సాప్ అకౌంట్ అదనపు లాక్ అవసరం. ఎవరైనా మీ నంబర్‌తో సీక్రెట్ పిన్ లేకుండా లాగిన్ చేయలేరు.
Settings > Account > Two-Step Verification
మీరు PIN మర్చిపోతే, 6 అంకెల PIN, ఇమెయిల్ ఆప్షనల్ సెట్ చేయండి.
4. గ్రూపులో యాడింగ్‌పై కంట్రోల్ :
తెలియని గ్రూపులలో జాయిన్ వద్దనుకుంటే మిమ్మల్ని ఎవరు యాడ్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చు.
Settings > Privacy > Groups
Everyone
My Contacts
My Contacts Except (నిర్దిష్ట వ్యక్తులపై బ్లాక్ )
5. లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయండి :
మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు లేదా చివరిగా ఎప్పుడు యాక్టివ్‌గా ఉన్నారో ఇతరులకు తెలియకుండా మీరు ఆ స్టేటస్ హైడ్ చేయొచ్చు.
Settings > Privacy > Last Seen & Online
మీ స్టేటస్ ఎవరు (everyone, your contacts, లేదా No One) చూడవచ్చో ఎంచుకోండి. ఈ ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయొచ్చు కానీ, మీ వాట్సాప్ అకౌంట్ ఉంచడంలో చాలా సాయపడతాయి. సెటప్ చేసేందుకు కొన్ని నిమిషాలు కేటాయించండి. మీ ప్రైవసీపై మరింత కంట్రోలింగ్ పొందవచ్చు.