SIP Investment : SIPలో పెట్టుబడికి సీక్రెట్ టిప్స్ తెలిస్తే.. సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చు.. మీ అకౌంటులో డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది!

SIP Investment : SIPలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇలా చేస్తే సామాన్యుడు కూడా కొద్ది సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు స్థాయికి ఎదగవచ్చు. ఈ సీక్రెట్ టిప్స్ గురించి తప్పక తెలుసుకోండి.

SIP Investment : SIPలో పెట్టుబడికి సీక్రెట్ టిప్స్ తెలిస్తే.. సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చు.. మీ అకౌంటులో డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది!

SIP Investment

Updated On : April 18, 2025 / 6:00 PM IST

SIP Investment : మీ డబ్బులు ఆదా చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడ పెట్టుబడి పెడితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు SIP ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ బెస్ట్. మీ డబ్బులను SIP ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో కోట్లాది రూపాయలను సంపాదించుకోవచ్చు.

వాస్తవానికి ఈ SIP ప్లాన్ అనేది మార్కెట్ లింక్డ్ స్కీమ్ అయినప్పటికీ అనేక మంది ఇందులోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సరైన వ్యూహంతో పెట్టుబడి పెడితే.. సామాన్యుడు కూడా కోట్లకు యజమాని అవ్వొచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఎస్ఐపీ విషయంలో ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తే చాలు.. మీరు కొన్ని సంవత్సరాల్లోనే మీ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

Read Also : OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

మీరు SIP ద్వారా భారీ పెట్టుబడి పెట్టాలని భావిస్తే.. వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టండి. వీలైనంత కాలం SIP కొనసాగించండి. దీర్ఘకాలిక SIP ద్వారా భారీ మొత్తంలో డబ్బులను సంపాదించవచ్చు. సాధారణంగా 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 సంవత్సరాల SIP సులభంగా కోటీశ్వరులు అయిపోవచ్చు.

SIP ప్రారంభించి మధ్యలో ఆపొద్దు :
సామాన్యులు కూడా SIP ప్రారంభిస్తే.. కొన్ని ఏళ్లలోనే కోట్లకు అధిపతి కావచ్చు అనమాట. ఒకవేళ మీరు SIP ప్రారంభించి మధ్యలో బ్రేక్ చేయవద్దు. పాజ్ చేయవద్దు. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా SIP పెట్టుబడులు పెట్టండి. కోట్ల డబ్బులు సంపాదించాలంటే క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం అనేది చాలా ముఖ్యమని గమనించాలి.

SIP అనేది మార్కెట్ లింక్డ్ స్కీమ్. మార్కెట్లో ఎప్పటికప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. మార్కెట్‌లో మాంద్యం భయంతో మీ SIPని ఎప్పుడూ ఆపకండి. మార్కెట్ తిరోగమనంలో ఉన్నప్పుడు మరిన్ని యూనిట్లను పొందవచ్చు. అదే మార్కెట్ తిరిగి పుంజుకుంటే అధిక రాబడిని పొందవచ్చు.

ఎస్ఐపీలో టాప్ అప్ ముఖ్యం :
మీ SIPని క్రమంగా కొనసాగించండి. మీరు SIP నుంచి భారీ లాభాలను పొందాలంటే.. అప్పుడప్పుడు స్టెప్-అప్ చేయండి. మీ ఆదాయం పెరిగేకొద్దీ.. ప్రతి సంవత్సరం 5శాతం లేదా 10శాతం టాప్-అప్ చేస్తుండాలి. మీకు కాంపౌండింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. వీలైనంత త్వరగా భారీ కార్పస్ సృష్టించుకోవచ్చు.

ఒకే SIPలో అధిక మొత్తంలో డబ్బును ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దు. మీ పోర్ట్‌ఫోలియోను పెంచుకోండి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో భారీగా రాబడిని పొందవచ్చు. SIPలోని అన్ని రాబడులు ఒకేలా ఉండవని గమనించాలి. మీ అవసరానికి అనుగుణంగా సరైన రాబడి మార్గాన్ని ఎంచుకోవాలి.

Read Also : Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కొంటున్నారా? వేసవిలో ఏసీల కన్నా పవర్‌ఫుల్ కూలర్లు ఇవే.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి..!

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో రాబడి చాలా బాగుంటుంది. అదే డెట్ ఫండ్లలో మాత్రం రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, హైబ్రిడ్ ఫండ్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. మీరు SIPలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడిని సంప్రదించవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.