Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కొంటున్నారా? వేసవిలో ఏసీల కన్నా పవర్‌ఫుల్ కూలర్లు ఇవే.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి..!

Air Coolers : ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ కూలర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ వేసవిలో పవర్‌ఫుల్ ఫీచర్లు, భారీ డిస్కౌంట్లతో ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయొచ్చు.

Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కొంటున్నారా? వేసవిలో ఏసీల కన్నా పవర్‌ఫుల్ కూలర్లు ఇవే.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి..!

Powerful Air Coolers

Updated On : April 18, 2025 / 5:35 PM IST

Air Coolers Offers : కొత్త ఎయిర్ కూలర్ కొంటున్నారా? వేసవిలో ఎయిర్ కూలర్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలైన ఫ్లిప్‌‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో ఎయిర్ కూలర్లు అందిస్తోంది. చాలామంది వినియోగదారులు వేడిని తట్టుకునేందుకు కొత్త ఎయిర్ కూలర్లను ఇంటికి తెచ్చుకుంటారు.

Read Also : Oppo A5 Pro 5G : వారెవ్వా.. ఒప్పో కొత్త 5G ఫోన్ కిర్రాక్.. ఫీచర్లు మాత్రం హైలెట్ అంతే.. ఈ నెల 24నే లాంచ్.. గెట్ రెడీ!

అయితే, ప్రతి ఒక్కరూ ఖరీదైన ఏసీలను కొనుగోలు చేయలేరు. కేవలం బడ్జెట్ ధరలో ఎయిర్ కూలర్‌ ఎంచుకోవచ్చు. మీరు తక్కువ బడ్జెట్‌లో ఉంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లోని కొన్ని పవర్‌ఫుల్ ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. కూలింగ్ పరంగా ఏసీలతో పోలిస్తే ఈ ఎయిర్ కూలర్లు అత్యంత చౌకైనవి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులతో ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్ కూలర్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్ 63 శాతం వరకు తగ్గింపు :
మీరు కొత్త ఎయిర్ కూలర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ వైడ్ రేంజ్ కూలర్‌లపై 63 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని బడ్జెట్‌లకు అందుబాటులో ఉంటుంది. మీరు మిస్ చేయకూడని కొన్ని టాప్ ఎయిర్ కూలర్ డీల్స్ ఓసారి పరిశీలిద్దాం.

వేసవిలో బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే :

హింద్‌వేర్ స్మార్ట్ ఎయిర్ కూలర్ (45L) :
అసలు ధర : రూ. 13,990
ఆఫర్ ధర : రూ. 5,999 (57 శాతం తగ్గింపు)
45L కెపాసిటీతో ఎయిర్ ప్లోతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా 5 శాతం తగ్గింపు అందిస్తుంది.

క్రాంప్టన్ 88L డెజర్ట్ ఎయిర్ కూలర్ :
హనీకోంబ్ ప్యాడ్‌లు, ఐస్ చాంబర్, 4-వే ఎయిర్ డిఫ్లెక్షన్‌తో వస్తుంది.
పెద్ద గదులకు అనువైనది. ఏసీ లాగా కూలింగ్ అందిస్తుంది.

క్రాంప్టన్ 75L డెజర్ట్ ఎయిర్ కూలర్ :
అసలు ధర : రూ. 17,200
డీల్ ధర : రూ. 9,999 (41 శాతం తగ్గింపు)
45 అడుగుల వరకు ఎయిర్ వీస్తుంది. తీవ్రమైన వేసవిలో బెస్ట్ కూలర్.

సింఫనీ 75L డెజర్ట్ ఎయిర్ కూలర్ :
అసలు ధర : రూ. 11,299
తగ్గింపు ధర : రూ. 9,491 (16 శాతం తగ్గింపు)
కూలింగ్ పవర్, హై-వాటర్ కెపాసిటీతో వస్తుంది.

Read Also : OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

పవర్ గార్డ్ 70L డెసర్ట్ ఎయిర్ కూలర్ :
అసలు ధర : రూ. 20,999
ఆఫర్ ధర : రూ. 7,699 (63 శాతం తగ్గింపు)
రోజంతా టర్బో కూలింగ్ కోసం బిగ్ వాటర్ ట్యాంక్, ఐస్ చాంబర్‌తో వస్తుంది.