Skoda SUV Models : స్కోడా నుంచి రెండు సరికొత్త మోడల్ కార్లు.. అద్భుతమైన ఫీచర్లు, కొత్త ఎడిషన్ల ధర ఎంతంటే?

Skoda SUV Models : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? స్కోడా ఆటో ఇండియా (Skoda SUV India) నుంచి సరికొత్త మోడల్ కార్లు వచ్చేశాయి. కొత్త ఎడిషన్లతో వచ్చిన ఈ రెండు స్కోడా SUV కార్ల ధరలు ఎంతంటే?

Skoda SUV Models : ప్రముఖ స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ (Skoda Auto India) నుంచి రెండు సరికొత్త SUV మోడల్ కార్లు లాంచ్ అయ్యాయి. కొత్త ఎడిషన్లతో వచ్చిన ఈ రెండు SUV కార్లను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారా? సెడాన్ (Sedan) అమ్మకానికి ఏడాది పూర్తయినందున స్కోడా స్లావియా వార్షికోత్సవ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. సెడాన్‌తో పాటు, బ్రాండ్ కుషాక్ లావా బ్లూ ఎడిషన్‌ (Kushaq Lava Blue Edition)ను కూడా లాంచ్ చేసింది. రెండు స్పెషల్ ఎడిషన్ మోడల్‌లు స్లావియా, కుషాక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లపైన స్లావియా యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 17.28 లక్షలు (ఎక్స్-షోరూమ్), కుషాక్ లావా బ్లూ ఎడిషన్ ధర రూ. 17.99 లక్షలుగా ఉంటుంది.

స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోల్క్ మాట్లాడుతూ.. భారత మార్కెట్లో కంపెనీ వృద్ధి ఆశయాలకు కీలకమైన కుషాక్, స్లావియా అన్ని కొత్త ఎడిషన్‌లను కొనసాగిస్తున్నామని చెప్పారు. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇండియా 2.0 కార్లను రెండూ సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేశాయి.

Skoda SUV Models launches Slavia Anniversary Edition and Kushaq Lava Blue Edition

Read Also : Best Smartphones in India : రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సరసమైన ధరలో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

భారత మార్కెట్లో భద్రత విషయానికి వస్తే.. నో కాంప్రమైజ్ సేఫ్టీ స్ట్రాటజీతో డ్రైవింగ్ డైనమిక్స్, డిజైన్ అందిస్తున్నాయి. కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023లో ఆ తర్వాత స్కోడా బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది. కుషాక్, స్లావియాపై కస్టమర్‌లకు మరింత వాల్యూను అందిస్తాయి. కుషాక్ లావా బ్లూ పేరు సూచించినట్లుగా.. లావా బ్లూ ఎక్ట్సీరియర్ షేడ్‌తో వస్తుంది. ఆక్టేవియా, సూపర్బ్, కోడియాక్‌లతో స్పెషల్ కలర్లతో వస్తుంది.

ఈ స్కోడా ఇండియా 2.0 కారు ప్రత్యేకమైన కారును పొందడం ఇదే మొదటిసారి. ప్రత్యేక ఎడిషన్‌లో సిగ్నేచర్ గ్రిల్ కూడా ఉంది. సైడ్ బాడీ క్లాడింగ్ కూడా క్రోమ్‌తో వచ్చింది. SUV ప్రత్యేక ఎడిషన్ బ్యాడ్జింగ్, టెక్స్‌టైల్ మ్యాట్‌లు, పుడ్ల్ ల్యాంప్‌లను కలిగి ఉంది. స్కోడా స్లావియా మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా స్లావియా యానివర్సరీ ఎడిషన్ స్టీరింగ్, స్కఫ్ ప్లేట్లు, C-పిల్లర్ వంటి ప్రత్యేకమైన బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంటుంది.

Skoda SUV Models launches Slavia Anniversary Edition and Kushaq Lava Blue Edition

కుషాక్ లావా బ్లూ మాదిరిగానే.. గ్రిల్, సైడ్ క్లాడింగ్ ఫీచర్ క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో అల్యూమినియం పెడల్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉన్నాయి. స్లావియా, కుషాక్ ప్రత్యేకంగా రెండూ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ మోటార్ 150bhp, 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా DSG ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. రెండు మోడళ్లతో పాటు చిన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ కూడా అందిస్తుంది.

Read Also : iPhone 13 Flipkart Offer : బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు