Skoda Slavia Car : సెడాన్ ప్రియులకు పండగే.. కొత్త స్కోడా స్లావియా కిర్రాక్.. సీట్ మసాజర్లు హైలెట్.. జస్ట్ రూ.15వేలకే బుకింగ్..!
Skoda Slavia Car : కొత్త స్కోడా స్లావియా వచ్చేసింది. ఇప్పుడు రూ. 15వేలు డిపాజిట్‌తో ఈ కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ కారు ఫీచర్లు, ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Skoda Slavia Car
- సరికొత్త ప్రీమియం ఫీచర్లతో స్కోడా స్లావియా ఆగయా
- ఈ కారు కొనాలని అనుకుంటే రూ. 15వేలు డిపాజిట్ కట్టండి
- ప్రీ బుకింగ్స్ ఓపెన్.. స్పెషల్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Skoda Slavia Car : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? స్కోడా ఆటో ఇండియా భారత మార్కెట్లో కొత్త సెడాన్, స్కోడా స్లావియాను ప్రవేశపెట్టింది. కంపెనీ కొత్త స్కోడా స్లావియాలో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ, అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
ఈ స్కోడా స్లావియా కొత్త, ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. కొత్త స్కోడా స్లావియా కొనేందుకు చూస్తుంటే రూ. 15వేలు డిపాజిట్‌తో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఇప్పటికే ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కొత్త స్కోడా స్లావియా ప్రత్యేక ఫీచర్లను ఇప్పుడు పరిశీలిద్దాం..
కొత్త స్కోడా స్లావియా క్లాసిక్, క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్లతో పాటు కంపెనీ మాంటే కార్లో ట్రిమ్ కూడా రిలీజ్ చేసింది.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
కొత్త స్కోడా స్లావియా కొత్త ఫీచర్లతో వస్తుంది. బ్యాక్ సీటు మసాజ్ ఫంక్షన్ అనేది అత్యంత ముఖ్యమైన ఫీచర్. లాంగ్ జర్నీలో బ్యాక్ కూర్చొనే ప్రయాణీకులకు మంచి కంపర్ట్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ కారులో 360-డిగ్రీ ఏరియా వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, పార్క్ పైలట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్లో 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేలకు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఏఐ (AI) ఆధారిత వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. గూగుల్ ఆటోమోటివ్ ఏఐ ఏజెంట్ ద్వారా డ్రైవర్లు వాయిస్ ద్వారా మ్యూజిక్, కాల్స్ క్లైమేట్ కంట్రోల్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఈ కారులో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త స్లావియా కారులో పెద్దలు, పిల్లల సేఫ్టీ కోసం గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా 25కు పైగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఉన్నాయి. అలాగే, టాప్ వేరియంట్లో 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇంజన్లు :
కొత్త స్కోడా స్లావియా 1.0 TSI ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 1.5 TSI ఇంజన్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 1.5 TSI వేరియంట్లో బ్యాక్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
