Stock Markets Loss : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం

ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది.

Stock Markets Loss : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూప్ షేర్లు పతనం

Stock markets

Updated On : February 6, 2023 / 9:49 PM IST

Stock Markets Loss : ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్ల లాస్ తో కొనసాగుతోంది. ఐటీసీ, ఎస్ పీఐ, ఎల్ అండ్ టీ, ఇడస్ బ్యాంక్, హీరో మోటర్ కార్లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఎస్ బీఐ లైఫ్, దివిస్ ల్యాబ్, ఎన్ వోజీసీ నష్టాల్లో ఉన్నాయి.

అదానీ గ్రూప్ షేర్లు ఇంకా తేరుకోలేదు. ఇక మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. అదానీ గ్రూప్ సంక్షోభంపై పార్లమెంట్ లో చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ స్టాక్స్ ఒత్తిడి లోనవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ 5శాతం, అదానీ స్పోర్ట్స్ 6 శాతం, అదానీ పవర్ 5 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.