Mission 300MT: భారత ప్రభుత్వ మిషన్ 300ఎంటీకి అనుగుణంగా రైల్ వ్యాగన్లు, కోచ్‌లను తయారీ కోసం ఒప్పందం
సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే "మిషన్ 3000 MT" ప్రారంభించింది

Mission 300MT: ప్రఖ్యాత అల్యూమినియం రోలింగ్, రీసైక్లింగ్ కంపెనీ అయిన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇంజనీరింగ్ కంపెనీ టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదరింది. భారతీయ రైల్వేలకు తమ ఉద్గార లక్ష్యాలు చేరుకోవటం, ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో సహాయపడుతూ ప్రపంచ స్థాయి అల్యూమినియం రైల్ వ్యాగన్లు, కోచ్‌లను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే “మిషన్ 3000 MT” ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యాగన్ డిజైన్‌ను మెరుగుపరచడానికి చురుకుగా ప్రయత్నిస్తుండటంతో పాటుగా మొత్తం మీద సామర్థ్యాన్ని, రైల్వే ఆస్తుల జీవిత కాలాన్ని పెంచడానికి అనువుగా తమ సొంత డిజైన్‌లను అందించాల్సిందిగా వ్యాగన్ తయారీదారులను రైల్వే ఆహ్వానిస్తోంది.