SUV Cars Sale : ఏప్రిల్‌లోనూ ఆగని కార్ల జోరు.. అత్యధికంగా అమ్ముడైన SUV కార్లు ఇవే..

SUV Cars Sale : ఏప్రిల్‌లో OEMల ద్వారా 157వేల కన్నా ఎక్కువ యూనిట్ల SUVలు డీలర్‌షిప్‌ వద్దకు చేరాయి. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్లో అత్యధిక అమ్మకాలతో SUV కార్ల జోరు కొనసాగుతోంది.

SUV Cars Sale : స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) సెగ్మెంట్ ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. మెరుగైన సెమీకండక్టర్ సరఫరా నేపథ్యంలో ఏప్రిల్‌లో తన వాటాను మరింత పెంచుకుంది. ఏప్రిల్ 2023లో PV మార్కెట్లో 331,747 యూనిట్ల వాల్యూమ్‌లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 293,821 యూనిట్ల కన్నా 13శాతం ఎక్కువ. ఏప్రిల్ 2023లో, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) 157,000 యూనిట్ల కన్నా ఎక్కువ SUVలను డీలర్‌షిప్‌లకు పంపారు.

దీని ఫలితంగా ఈ విభాగానికి 47శాతానికిపైగా మార్కెట్ వాటా లభించింది. SUV సెగ్మెంట్ FY23లో 43శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌లుగా ఉద్భవించాయి. ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. SUV సెగ్మెంట్ మార్కెట్ వాటా మరింత పెరగవచ్చు. అంటే.. దాదాపు 48శాతం నుంచి 49శాతం వద్ద ఉంటుంది.

Read Also : Realme 11 Series : 200MP కెమెరాతో రియల్‌మి 11 సిరీస్ వచ్చేస్తోంది.. భారత్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

ఏప్రిల్ 2023లో భారత మార్కెట్లో (మారుతి సుజుకి వ్యాగన్R) అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అత్యధికంగా అమ్ముడైన SUV టాటా నెక్సాన్ కూడా ఉంది. ఆటో మొబైల్ సమాచారం ప్రకారం.. టాటా నెక్సాన్ ఈ నెలలో 15,002 యూనిట్ల వాల్యూమ్‌లను నమోదు చేసింది.

SUV Cars Sale _ March of SUVs continues in April _ Nexon, Creta, Brezza shine

ఆ తర్వాత హ్యుందాయ్ క్రెటా 14,186 యూనిట్లు, మారుతి సుజుకి బ్రెజ్జా 11,836 యూనిట్ల వద్ద ఉన్నాయి. ఏప్రిల్ 2023లో టాటా పంచ్ పవర్ ఫుల్ రన్‌తో 10,934 యూనిట్ల వాల్యూమ్‌లను సాధించింది. హ్యుందాయ్ వెన్యూ 10,342 యూనిట్ల వద్ద వెనుకబడి ఉంది.

ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన SUVలు :

* టాటా నెక్సాన్ – 15,002 యూనిట్లు
* హ్యుందాయ్ క్రెటా – 14,186 యూనిట్లు
* మారుతి సుజుకి బ్రెజ్జా – 11,836 యూనిట్లు
* టాటా పంచ్ – 10,934 యూనిట్లు
* హ్యుందాయ్ వెన్యూ – 10,342 యూనిట్లు

Read Also : Poco F5 5G Launch : రూ. 30వేల లోపు ధరకే పోకో F5 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

ట్రెండింగ్ వార్తలు