Swiggyలో వెయ్యి ఉద్యోగాల కోత

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రాబోయే నెలలో 800-900 ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించనుంది. కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాన్ని కంపెనీ ఆమెదించింది. ఫలితంగా వందల కొద్దీ స్టార్టప్ రెస్టారెంట్లపైనా ఈ ప్రభావం కనిపించనుంది.
బెంగళూరుకు చెందిన స్విగ్గీ సగానికి పైగా ప్రొడక్షన్ ను షట్ డౌన్ చేసేసింది. అంతేకాకుండా ఆ కిచెన్లకు చెల్లించాల్సిన అద్దెలో సైతం సగానికి పైగా కోత విధించింది. స్విగ్గీ ముందుగా ఫిబ్రవరి-మార్చి నెలలోనే ఉద్యోగులను తొలగించాలనుకుంది ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నా ఇప్పడు తప్పడం లేదు. సోమవారం పేటీఎం 700మంది ఉద్యోగులను తొలగించి కారణాలు వెల్లడించలేదు.
ఫిబ్రవరి నుంచి ఉద్యోగులకు 153 మిలియన్ డాలర్లు రావాల్సి ఉండగా 43 మిలియన్ డాలర్లు మాత్రమే చేజిక్కించుకుంది. నిజానికి సంవత్సర రాబడి ఆధారంగా స్విగ్గీలో 40శాతం ఉద్యోగాల కోత మామూలే. పూర్ పెర్మార్మెన్స్ చేసిన 300మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశిస్తారు.
లాక్‌డౌన్ పొడిగింపు ప్రభావం నష్టాలు తెచ్చిపెడ్డకుండా ఉండాలని.. కంపెనీ ఎదుగుదల, లాభాలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని స్విగ్గీ చెబుతుంది. ఇందులో భూములను కాంట్రాక్ట్ తీసుకుని నడిపిస్తున్న బ్రాంచులు, కొన్ని కిచెన్లను రద్దు చేయడం వాటి కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మే నెల నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.