Tata Group Jobs : టాటా గ్రూపులో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. వీటికే ఫుల్ డిమాండ్!

Tata Group Jobs : సెమీకండక్టర్స్, విద్యుత్ వాహనాలు(EV), బ్యాటరీలు వంటి విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్టు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.

Tata Group Jobs : టాటా గ్రూపులో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.. వీటికే ఫుల్ డిమాండ్!

Tata Group will generate 5 lakh jobs in 5 years ( Image Source : Google )

Updated On : October 15, 2024 / 4:27 PM IST

Tata Group Jobs : దేశంలోనే అతిపెద్ద మార్కెట్ వాల్యూ కలిగిన సంస్థ టాటా గ్రూప్. అనతికాలంలోనే అనేక రంగాల్లోని మార్కెట్లోకి వేగంగా విస్తరించింది. టాప్ గ్రూపు ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో కంపెనీలు రన్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ప్రకారం.. దాదాపు 20 వరకు కంపెనీలు ఉన్నట్టు అంచనా.

టాటా గ్రూపు వంటి పరిశ్రమలను విస్తరించి వచ్చే ఐదేళ్లలో తయారీ రంగంలో భారీ 5 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. సెమీకండక్టర్స్, విద్యుత్ వాహనాలు(EV), బ్యాటరీలు వంటి విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగవకాశాలను కల్పించనున్నట్టు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.

ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నిర్వహించిన సింపోజియంలో ఆయన మాట్లాడుతూ.. భారత పురోగతి, ఉత్పత్తి సామర్థ్యంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అన్నారు. తయారీ రంగంలో ఉద్యోగాల అవసరం ఎంతైనా ఉందని, ప్రతి నెలా ఉద్యోగ విపణిలోకి కొత్త కార్మికులు వస్తున్నారని చెప్పారు. ఈ తయారీ రంగంలో ఉపాధి కల్పించడం చాలా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే భారత్ లక్ష్యంలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చంద్రశేఖరన్ అన్నారు.

ఈ రంగాల్లోనే ఉద్యోగవకాశాలు : 
“సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంబంధిత పరిశ్రమలలో పెట్టుబడుల ద్వారా టాటా గ్రూప్ రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేస్తోంది” అని చంద్రశేఖరన్ తెలిపారు. అస్సాంలో గ్రూప్ రాబోయే సెమీకండక్టర్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల కోసం కొత్త తయారీ సౌకర్యాలు ఉద్యోగ సృష్టికి గణనీయమైన సహకారాన్ని అందించాయని ఆయన సూచించారు.

ఈ ప్రాజెక్టుల నుంచి అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, తయారీ రంగంలో ఉద్యోగ కల్పన అంత్యంత ప్రభావాన్ని చూపుతుందుని వివరించారు. లెక్కల ప్రకారం.. సెమీకండక్టర్ల వంటి రంగాలలో సృష్టించిన ప్రతి ఉద్యోగానికి, అదనంగా పది పరోక్ష ఉద్యోగాలు ఉద్భవించవచ్చునని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

టాటా గ్రూప్ పెట్టుబడులు చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SME) వృద్ధిని కూడా ప్రోత్సహిస్తాయి. ఈ పరిశ్రమలకు మద్దతులో భాగంగా 5 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా. దీనిపై ఆయన ప్రస్తావిస్తూ.. ఉత్పత్తి ఉపాధిలో “విక్షిత్ భారత్” (అభివృద్ధి చెందిన భారతదేశం)గా మారాలనే భారత దృష్టి సాధ్యపడదని చెప్పారు. “ప్రతి నెల ఒక మిలియన్ మంది వర్క్‌ఫోర్స్‌లో చేరుతున్నారు. మేం 100 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాలి” అని చంద్రశేఖరన్ అన్నారు.

అస్సాంలో టాటా గ్రూప్ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త తయారీ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉంటాయి. ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించిన విధంగా తమ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చనని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : WhatsApp Accounts Ban : ప్రైవసీ రూల్స్ బ్రేక్.. ఒకే నెలలో 80 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లపై నిషేధం!