Keys of Safety : టాటా మోటార్స్ కార్లపై రూ.5వేలు EMI ఆఫర్

భారతీయ అతిపెద్ద ఆటోమేకర్ టాటా మోటార్స్ ఈఎంఐ ఆఫర్ ప్రవేశపెట్టింది. వినియోగదారులను ఆకర్షించేలా కారు సేల్స్ పెంచుకునేందుకు కొత్త ఈఎంఐ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కారు సేల్స్ పై రూ.5వేలు వరకు ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక రంగమైన కార్ల మార్కెట్లలో దాదాపు 70 శాతం కలిగిన మారుతీ సుజూకీ, హుందాయ్‌తో పోటీగా టాటా మోటార్స్ ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. ముంబై ఆధారిత ఆటో మేజర్ ‘Keys of Safety’ అనే పేరుతో కొత్త ఫైనాన్షింగ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీనిద్వారా కొత్త రేంజ్ కార్లపై చౌకైన వాహన రుణాలు సులభంగా పొందొచ్చు.
ఈ ప్యాకేజీ కింద 4 స్టార్ గ్లోబల్ NCAP సేప్టీ రేటెడ్ పాపులర్ Tata Tiago హ్యాచ్ బ్యాక్ కారు కొనుగోలు చేసుకోవచ్చు. నెలవారీ ఇన్ స్టాల్ మెంట్ ప్రారంభ ధర కేవలం రూ.5వేలు మాత్రమే. గరిష్టంగా ఐదేళ్ల కాల పరిమితిలో రూ.5 లక్షల వరకు పొందే వాహన రుణాలపై ఈ EMI అమౌంట్ వర్తిస్తుంది. ఇందులో అదనంగా మరో బెనిఫెట్ అందిస్తోంది. కస్టమర్లు మూడు ఆప్షన్లలో ఏదైనా ఒక అమౌంట్ ఎంచుకోవచ్చు. చివరి ఈఎంఐ చెల్లింపు సమయంలో వాడుకోవచ్చు.
అందులో ఒకటి.. (i) రూ.5 లక్షల లోన్‌పై గత ఏడాది ఇన్‌స్టాల్ మెంట్‌ను బుల్లెట్ ఈఎంఐగా (రూ.90వేలు) ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు. వాహనాన్ని పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. (ii) ఆర్థికంగా ఇబ్బందితో చెల్లించకుంటే వాహనాన్ని టాటా మోటార్స్ ఫైనాన్షింగ్ పార్టనర్ కు తిరిగి ఇచ్చేయొచ్చు లేదా (iii) ఈ చివరి ఈఎంఐని రీఫైనాన్స్ చేసుకునేలా ఎంచుకోవచ్చు. హ్యాచ్ బ్యాక్స్ సీడాన్స్, ఎస్ యూవీ వంటి కార్లకు ఈ కొత్త రాయితీ కలిగిన ఫైనాన్స్ స్కీమ్స్ వర్తిస్తాయి. పాపులర్ టాటా టియాగో, టైగర్, నెక్సాన్, హరియర్ మోడల్స్ పై కూడా ఈ స్కీమ్ వర్తిస్తాయి.
ఆన్ రోడ్ ఫండింగ్‌పై సేఫెస్ట్ రేంజ్ కార్లు, ఎస్‌యూవీలతో దీర్ఘకాలిక లోన్లపై 8ఏళ్ల వరకు 100 శాతం ఆఫర్ చేస్తోంది టాటా మోటార్స్. Altroz మోడల్ మినహా SUV ఇతర మోడల్ కార్లపై 45,000 వరకు స్పెషల్ బెనిఫెట్స్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ కు 400 సేల్స్ టచ్ పాయింట్లు, 450 వర్క్ షాపులు, 160 సేల్స్ ఔట్ లెట్స్ , 144 వర్క్ షాపులు సౌతరన్ జోన్ లో ఉన్నాయి.
Read: కరోనా టైం : June లో Bank Holidays